ఏపీలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో వైసీపీ అధినేత, సీఎం జగన్ పర్యటనలకు శ్రీకారం చుట్టారు.ఈ మేరకు ఈ నెలాఖరు నుంచి జిల్లాల్లో పర్యటించనున్నారు.
ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పార్టీ క్యాడర్ తో సీఎం జగన్ సమావేశాలు నిర్వహించనున్నారు.ఇందులో భాగంగా ఐదేళ్ల పాలనతో పాటు పార్టీ నిర్ణయాలను శ్రేణులకు సీఎం జగన్ వివరించనున్నారు.
ఉత్తరాంధ్ర నుంచి సమావేశాలు ప్రారంభం కానుండగా రోజుకు రెండు జిల్లాల్లో సమావేశాలు నిర్వహించనున్నారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే పార్టీ క్యాడర్ ను ఎన్నికలకు సమాయత్తం చేయనున్నారు.
అందరూ కలిసికట్టుగా పని చేయాలని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్నారు.అలాగే కొత్త మ్యానిఫెస్టోపై ఈ నెలాఖరులోగా కమిటీ వేయాలని ఇప్పటికే సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.
అభ్యర్థుల ఎంపిక, ఇంఛార్జుల మార్పులతో పాటు సీట్లు కోల్పోయిన వారికి భవిష్యత్ లో ఇచ్చే ప్రాధాన్యతపై సీఎం జగన్ హామీ ఇవ్వనున్నారని తెలుస్తోంది.







