మెగాస్టార్ చిరంజీవికి(Chiranjeevi ) టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకపోయినా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ఈయనకు భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారు చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత కూడా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.
ఈ విధంగా మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఆయన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని చెప్పాలి.

ప్రస్తుత కాలంలో ఒక సినిమా వంద రోజులు ఆడే సినిమాలు కనపడటం లేదు ఒకానొక సమయంలో ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తే సంవత్సరాలు కొద్ది థియేటర్లలో ప్రేక్షకులను సందడి చేసేది కానీ ఇప్పుడు మాత్రం ఒక సినిమా విడుదలై 100 కోట్లు రాబట్టిందా అయితే ఆ సినిమా హిట్ అని భావిస్తున్నారు.ప్రస్తుత కాలంలో ఒక సినిమా రెండు వారాలపాటు థియేటర్లలో ప్రదర్శితమైతేనే గొప్ప అలాంటిది మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా మరో రెండు రోజులలో 365 రోజులు పూర్తి చేసుకొని సంచలనమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకోబోతోంది.

గత ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి చిత్రం వాల్తేరు వీరయ్య (Waltair Veerayya).డైరెక్టర్ బాబి (Bobby) దర్శకత్వంలో చిరంజీవి శృతిహాసన్ (Shruthi Hassan) నటించినటువంటి ఈ సినిమా గత సంక్రాంతికి విడుదలైంది.అయితే ఈ సినిమా అవనిగడ్డలో ఉన్నటువంటి రామకృష్ణ థియేటర్లో( Ramakrishna Theatre ) ప్రతిరోజు నాలుగు ఆటలతో ఏడాది పాటు సినిమా ప్రదర్శితం అవుతూ వస్తుంది.
ఈ క్రమంలోనే ఈ సినిమా 365 రోజులను పూర్తి చేసుకోబోతున్నటువంటి తరుణంలో నేడు మెగా అభిమానులు ఈ వేడుకను సెలబ్రేట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.ఇలాంటి రోజులలో కూడా మెగాస్టార్ చిరంజీవి సినిమా ఏడాది పాటు థియేటర్లలో సందడి చేసింది అంటే మెగాస్టార్ క్రేజ్ ఏంటో స్పష్టంగా అర్థమవుతుంది.