ఒక్క కొడుకుంటే కీడట...కీడుకు విరుగుడు గాజులట...?

నల్లగొండ జిల్లా:తెలంగాణలో వ్యాప్తంగా ప్రస్తుతం ఒక వింత ఆచారం వెలుగులోకి వచ్చింది.ఎవరికైనా ఒక్క కొడుకు ఉంటే ఇంటికి కీడుఅంట.

 An Only Son Is Evil The Antidote To Evil Is Bangles , Telangana, Bangles-TeluguStop.com

ఆ కీడుకు విరుగుడు ఇద్దరు కొడుకులు ఉన్న వారు ఒక్క కొడుకు ఉన్నవారికి గాజులు వేయించాలట.ఇప్పుడు ఈ “గాజుల కానుక”( gajula kanuka ) ప్రచారం ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతోంది.

ఒక్క కొడుకు ఉన్న మహిళలు ఇద్దరు కొడుకులు ఉన్న ఐదుగురి మహిళల వద్ద డబ్బులు తీసుకుని,ఐదు రకాల గాజులు వేసుకోవాలనే మూఢ నమ్మకం ట్రెండింగ్ లో కొచ్చింది.ఈ సంప్రదాయం ఫాలో కాని ఎడల కీడు జరుగుతుందనే ప్రచారం ఊపందుకోవడంతో ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు ఆడపడుచులు.

ఇప్పుడు తెలంగాణలో( Telangana ) ఎక్కడ చూసినా గాజుల చర్చే సాగుతోంది.దాంతో మూఢ నమ్మకాల పుణ్యమాని గాజుల దుకాణ దారులకు భలే గిరాకీ తగిలింది.

గాజులకు కూడా డిమాండ్ పెరిగింది.కాగా ఈ మూఢ ప్రచారాన్ని నిపుణులు.

కొట్టిపారేస్తున్నారు.ఇలాంటి మూఢ నమ్మకాలని నమ్మొద్దని సూచిస్తున్నారు.

ఏదేమైనా ట్రెండ్ ఫాలో అవ్వాల్సిందే అంటున్నారు మహిళలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube