కూరగాయ పంటలకు( vegetable crops ) పండు ఈగల బెడద చాలా ఎక్కువ.ఇక తీగజాతి కూరగాయలకైతే ఈ పండు ఈగ బెడద పెద్ద తలనొప్పిగా మారింది.
ఈ పండు ఈగలు పంట పిందె దశలో కు చేరుకున్నాక కాయ తయారయ్యే దశ వరకు ఎప్పుడైనా ఆశించి నష్టం కలిగించే అవకాశం ఉంది.కూరగాయలు సాగు చేసే రైతులకు పండు ఈగలను ఎలా అరికట్టాలో సరైన అవగాహన లేకపోవడం వల్ల దిగుబడులు గణనీయంగా తగ్గిపోతున్నాయి.
కూరగాయ పంటలకు మార్కెట్లో ఎప్పుడు మంచి డిమాండే ఉంటుంది.నగరాలలో ఉండే మార్కెట్లలో కూరగాయ పంటలకు ఎంత డిమాండ్ ఉంటుందో మాటల్లో చెప్పలేం.
కూరగాయల సాగు విస్తీర్ణం ప్రతి ఏటా పెరుగుతూ వస్తోంది.కానీ ఆశించిన స్థాయిలో దిగుబడులు మాత్రం సాధించలేకపోతున్నారు.
కూరగాయ పంటలకు ఆశించి తీవ్ర నష్టం కలిగించే చీడపీడలు తెగుళ్లు ఏవో ముందుగానే తెలుసుకొని అవి పంటను ఆశించిన తర్వాత ఎలా అరికట్టాలో అవగాహన కల్పించుకుంటే మంచి దిగుబడులు సాధించవచ్చు నని వ్యవసాయ క్షేత్ర నిపుణులు చెబుతున్నారు.
తీగజాతి కూరగాయలను( Vine Growing Vegetables ) శాశ్వత పందిర్లు ఏర్పాటు చేసి సాగు చేయడం ఉత్తమం.పండు ఈగలు ఆశించిన పంటకు మార్కెట్లో సరైన గిట్టుబాటు ధర ఉండదు.ఈ పండు ఈగలను ఎలా అరికట్టాలంటే.
పొలంలో మొక్కల మధ్య, మొక్కల వరుసల మధ్య కాస్త అధిక దూరం ఉండేలా పంట వేసుకోవాలి.పొలంలో ఎప్పటికప్పుడు కలుపు ను తొలగిస్తూ ఉండాలి.
ఒక ఎకరం పొలంలో ఐదు లేదా ఆరు లింగాకర్షణ బుట్టలు అమర్చాలి.
ఈ పండు ఈగలను పొలంలో గుర్తించిన తరువాత రెండు మిల్లీలీటర్ల ప్రొఫెనోపాస్ ను ఒక లీటరు నీటిలో కలిపి మొక్కల ఆకులు, పిందెలు పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేయాలి.లేదంటే 100 మిల్లీలీటర్ల మలాథియాన్ కు 100 గ్రాముల బెల్లం( Jaggery ) కలిపి పది లీటర్ల నీటిలో కలపాలి.ఈ మిశ్రమాన్ని చిన్న పెంకుల్లో పోసి పొలంలో అక్కడక్కడ పెట్టాలి.
ఇలా చేయడం వల్ల పండు ఈగలను పూర్తిగా అరికట్టవచ్చు.