క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీకి రాజీనామా చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.అంబటి రాయుడు ఓ క్రికెటర్ అన్న ఆయన రాయుడిని జగన్ నమ్మించి మోసం చేశాడని తెలిపారు.
గుంటూరు జిల్లాకు చెందిన అంబటి రాయుడు ఆశపడ్డాడని చంద్రబాబు పేర్కొన్నారు.జగన్ మాయగాడన్న ఆయన గుంటూరు పార్లమెంట్ స్థానాన్ని ఇస్తానని నమ్మించారు.
తరువాత అదే స్థానాన్ని ఇంకొకరికి కూడా ఇస్తానని చెప్పాడు.అయితే ఆ పేరు తాను చెప్పనని చంద్రబాబు తెలిపారు.
జగన్ నైజం ఏంటో అంబటి రాయుడికి అర్థం అయిందన్నారు.ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో వైసీపీ క్లీన్ బౌల్డ్ కావడం ఖాయమని తెలుసుకుని.
ఫీల్డ్ లోకి ఎంటర్ కాకముందే పారిపోయాడని విమర్శించారు.







