Alluri Seetharamaraju Movie: అల్లూరి సీతారామరాజు సినిమాకు ముగ్గురు ఎందుకు దర్శకత్వం వహించాల్సి వచ్చింది..?

అల్లూరి సీతారామరాజు చిత్రం( Alluri Seetharamaraju Movie ) 1974లో కృష్ణ హీరోగా( Superstar Krishna ) విజయనిర్మల( Vijaya Nirmala ) హీరోయిన్ గా విడుదలై ఘనవిజయం సాధించింది.ఈ సినిమా అప్పట్లో సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు గిరిజన విప్లవ నాయకుడు అల్లూరి సీతారామరాజు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా వెండితెరపై ఆవిష్కరించగా ఇది దక్కించిన విజయంతో కృష్ణకు దాదాపు ఒక ఎనిమిదేళ్ల పాటు ఏ సినిమా కూడా ఆడలేదు.

 Why Alluri Sitharamaraju Movie Directed By 3 People-TeluguStop.com

అంతలా దీని ప్రభావం కృష్ణ కెరియర్ పై పడింది.నిజానికి అల్లూరిపై సినిమా తీయాలని చాలామంది హీరోలు ప్రయత్నించిన అది కేవలం కృష్ణకు మాత్రమే సాధ్యమైంది.

ఎన్టీఆర్ శోభన్ బాబు స్క్రిప్ట్ వరకు కూడా చేయించుకుని ఈ చిత్రాన్ని తీయలేకపోయారు.

Telugu Ksr Das, Colorscope, Vijaya Nirmala, Sr Ntr, Krishna, Tollywood-Movie

ఇక ఆదిశేషగిరిరావు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా అద్భుత విజయాన్ని సాధించింది దర్శకుల విషయానికొస్తే ఈ చిత్రానికి మొట్టమొదట అనుకున్న దర్శకుడు కేవలం రామచంద్రరావు( Director Ramachandra Rao ) మాత్రమే కానీ సినిమా షూటింగ్ జరిగిన తర్వాత కొన్ని రోజులకు ఆయన అకాల మరణం చెందడంతో ఎటు పాలు పూరి కృష్ణ తానే దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టాల్సి వచ్చింది.ఇలా రామచంద్రరావు మరణంతో కృష్ణ కూడా దర్శకుడిగా ఈ చిత్రాన్ని పూర్తి చేయగా యాక్షన్ మరియు పోరాట సన్నివేశాల కోసం కృష్ణ ఆప్తమిత్రుడు మరియు దర్శకుడు అయిన కె ఎస్ దాస్ ని( KS Das ) సంప్రదించాడు.సౌత్ ఇండియాలో మొట్టమొదటిగా కౌబాయ్ సినిమా తీసి కృష్ణకు తిరుగులేని విజయాన్ని కట్టబెట్టిన దాస్ పూర్తి పోరాట సన్నివేశాలను తెరకెక్కించాడు.

Telugu Ksr Das, Colorscope, Vijaya Nirmala, Sr Ntr, Krishna, Tollywood-Movie

ఇలా చాలా రోజులపాటు షూటింగ్ ఆగుతూ జరుగుతూ ముగ్గురు దర్శకులు చేతుల మీదుగా సినిమా పూర్తయి చివరకు థియేటర్లో విడుదలైంది.తెలుగు సినిమాలో మొట్టమొదటిసారి కలర్ స్కోప్ వాడిన చిత్రంగా కూడా అల్లూరి సీతారామరాజు రికార్డు పుటలోకి ఎక్కింది.ఇక ఈ చిత్రాన్ని చూసిన తర్వాత ఎన్టీఆర్( NTR ) అల్లూరి సీతారామరాజు పాత్రకు కృష్ణ తప్ప మరెవరు న్యాయం చేయలేరని ఒప్పుకున్నారు.బాలీవుడ్ లో పాకీజా చిత్రం కోసం పాడిన కెమెరాస్కోప్ పరికరాలని ఈ చిత్రం కోసం కూడా కృష్ణ తెప్పించి వాడటంతో తెలుగులో మొట్టమొదటి కలర్ స్కోప్ చిత్రంగా ఇది నిలిచిపోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube