అల్లం పంటను ఆశించే ఆకుమచ్చ తెగుల నివారణ కోసం సరైన యాజమాన్య పద్ధతులు..!

అల్లం పంటను( Ginger Crop ) ఆశించే ఆకుమచ్చ తెగుళ్లు ఒక శిలీంద్రం ద్వారా పంటను ఆశిస్తుంది.మట్టిలో, వివిధ వ్యాధులు సోకిన మొక్కల అవశేషాల్లో దాగి ఉన్న బీజం ద్వారా ప్రాథమిక సంక్రమణ సంభవిస్తుంది.

 How To Prevent Leaf Spot In Ginger Cultivation Details, Leaf Spot ,ginger Culti-TeluguStop.com

గాలి, వర్షం ద్వారా రెండవ సంక్రమణ జరుగుతుంది.రెండు వారాల వయసు ఉండే ఆకులు( Leaves ) ఈ వ్యాధికి గురయ్యే అవకాశం చాలా ఎక్కువ.

అల్లం మొక్క లేత ఆకులపై చిన్నని నీటితో తడిచిన మచ్చలు కనిపిస్తే, ఆ మచ్చల చుట్టూ ముదురు అంచుతో పసుపు రంగు వలయం ఏర్పడుతూ ఉందంటే ఆ మొక్కకు ఆకు మచ్చ తెగుళ్లు( Leaf Spots ) సోకినట్టే.ఈ మచ్చలు క్రమంగా విస్తరించడం వల్ల మొక్కలు ఎండిపోయి చివరికి చనిపోయే అవకాశం ఉంది.

ఈ ఆకు మచ్చ తెగులు పంటకు సోకకుండా ఉండాలంటే.మద్యస్థ నిరోధక రకాలను ఎంపిక చేసుకుని సాగు చేయాలి.రెండు లేదా మూడు సంవత్సరాలకు ఒకసారి కచ్చితంగా పంట మార్పిడి చేయాలి.తెగులు సోకిన మొక్క ఆకులను తుంచేయాలి లేదంటే మొక్కనే పీకేసి నాశనం చేయాలి.ఇక ఈ తెగులను( Rots ) నిరోధించే సేంద్రియ పద్ధతులు లేవు కాబట్టి ఈ తెగులను కేవలం రసాయన పద్ధతిలో మాత్రమే నివారించగలం.

అల్లం పంటను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటూ, ఆకుమచ్చ తెగుళ్లు సోకిన లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆ మొక్కలను పీకేసి.రసాయన పిచికారి మందులైన కార్బెండిజమ్+ మాంకోజెబ్ మిశ్రమాన్ని ఒక లీటర్ నీటిలో కలిపి 20 రోజులు రెండుసార్లు పిచికారి చేయాలి.లేదంటే హెక్సాకొనజోల్ 0.1% ను ఒక లీటరు నీటిలో కలిపి మొక్కల ఆకులు పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేయాలి.పంట పొలంలో ఎప్పటికప్పుడు కలుపు తీసేయాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube