రాజన్న సిరిసిల్ల జిల్లా :మానాల ను అన్ని విధాలుగా అభివృధి చేస్తామని ప్రభుత్వ విప్, వేములవాడ( Vemulawada ) ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.నా విజయం ప్రజా విజయం అని… తాను ఎమ్మెల్యే గా ఎన్నికవ్వడంలో మానాల ప్రజలు తమవంతు తోడ్పాటు అందించారని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.
వేములవాడ ఎమ్మెల్యే గా ఎన్నికై మొదటిసారి రుద్రoగి మండలం మానాల గ్రామానికి విచ్చేసిన ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్( MLA Adi Srinivas ) కు మానాల ప్రజలు ఘనస్వాగతం పలికారు.మొదటిసారి గ్రామానికి వచ్చిన సందర్భంగా గజమాలతో ఘనంగా సన్మానించారు.
మానాల గ్రామంలోని శ్రీ భవానిశంబు లింగేశ్వరస్వామి,సేవలాల్ మహరాజ్ దేవాలయలన్నీ దర్శించి,ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నా విజయానికి అహర్నిశలు కృషి చేసిన వేములవాడ ప్రజానికి,రుద్రoగి మండల ప్రజానికి,పరోక్షంగా కృషి చేసిన మానాల గ్రామ ప్రజానీకానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
నియోజకవర్గ పరిధి వేరే అయిన మానాల గ్రామంతో తనకు విడదీయరాని అనుబంధం ఉందని గుర్తు చేశారు.తన గెలుపు కోసం మానాల గ్రామ ప్రజానీకం తమ తమ ఫోన్ ల ద్వారా తమ బంధువులకు సమాచారం అందించి తన గెలుపులో కుటుంబసభ్యుల వలే భాగస్వామ్యం అయ్యారని అన్నారు.
తన చిన్నతనంలో వేసవి సెలవుల్లో ఎక్కువ సమయం ఇక్కడే గడిపేవారని అన్నారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం మొదట గా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వచ్చిందని తెలిపారు.
రాజీవ్ ఆరోగ్య శ్రీపథకం( TS Rajiv Arogyasri Scheme ) కింద 10 లక్షల వరకు అమలు చేశామని అన్నారు.పేద ప్రజలకు మేలు కేవలం ఈ ప్రభుత్వం ద్వారానే జరుగుతుందని దానికి నిదర్శనం ప్రజా పాలన కార్యక్రమం అని అన్నారు.
మానాల గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పథంలో తీసుకెలుస్తాం అన్నారు.అలాగే రానున్న రోజుల్లో మిగతా హామీలు అమలు చేస్తామని అన్నారు







