ఏపీ సీఎం జగన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘యాత్ర -2’ సినిమా టీజర్ విడుదల అయింది.వైఎస్ఆర్ మరణం తరువాత వైఎస్ జగన్ రాజకీయ తీరుతో పాటు 2009 నుంచి 2019 వరకు ఏపీలో జరిగిన రాజకీయ ఘటనల ఆధారంగా సినిమా తెరకెక్కింది.
వైఎస్ఆర్ పాత్రలో ప్రముఖ మలయాళ హీరో మమ్ముట్టి నటించగా వైఎస్ జగన్ పాత్రలో తమిళ నటుడు జీవా నటించారు.మహి వి రాఘవ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.
కాగా ఫిబ్రవరి 8వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.







