టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు( Trivikram Srinivas ) ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.త్రివిక్రమ్ శ్రీనివాస్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
మరికొన్ని రోజుల్లో గుంటూరు కారం సినిమాతో( Guntur Karam Movie ) త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు.తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.2 గంటల 39 నిమిషాల నిడివితో ఈ సినిమా రిలీజ్ కానుంది.
అయితే త్రివిక్రమ్ పై గతంలో పలు సందర్భాల్లో ఫైర్ అయిన పూనమ్ కౌర్( Poonam Kaur ) తాజాగా మరోమారు అతనిపై షాకింగ్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి.
గుంటూరు కారం మూవీ స్టోరీ లైన్ ప్రముఖ రచయిత్రి యద్దనపూడి సులోచనరాణి( Yuddanapudi Sulochana Rani ) కీర్తి కిరీటాలు( Keerthi Kireetalu ) నుంచి తీసుకున్నారని సమాచారం అందుతోందని ఒక ప్రముఖ వెబ్ సైట్ పోస్ట్ పెట్టగా ఆ పోస్ట్ గురించి పూనమ్ కౌర్ రియాక్ట్ అయ్యారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏదైనా చేయగలడని చేసి దాని నుంచి బయటపడగలడని ఆమె కామెంట్లు చేశారు.త్రివిక్రమ్ శ్రీనివాస్ చేసే తప్పు పనులకు ప్రత్యేకంగా ముసుగు వేస్తారని ఆయన చేసే తప్పుడు పనులను ఎవరూ చూడలేదని పూనమ్ కౌర్ వెల్లడించారు.గత ప్రభుత్వాల సీఎంల కార్యాలయాలతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఏర్పడిందని గురూజీ అంటూ సంబోధిస్తూ పూనమ్ కౌర్ ఈ కామెంట్లు చేశారు.

గుంటూరు కారం కథ కాపీ అంటూ వస్తున్న వార్తల గురించి మేకర్స్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.త్రివిక్రమ్ తర్వాత ప్రాజెక్ట్ లు కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచి నిర్మాతలకు ఊహించని స్థాయిలో లాభాలను అందించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.పూనమ్ కౌర్ కామెంట్ల విషయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ రియాక్ట్ అవుతారో లేదో చూడాలి.త్రివిక్రమ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.







