జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిన ప్రాంతంలో ఎలక్ట్రికల్ రెసిస్టివిట్ టెస్ట్ జరుగుతోంది.ఈ మేరకు ఓ ప్రైవేట్ సంస్థతో ప్రాజెక్టు నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ పరీక్షలు చేయిస్తుంది.
మేడిగడ్డ బ్యారేజ్ అనంతరం సుందిళ్ల, అన్నారం బ్యారేజీలకు కూడా ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ పరీక్షలను నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ టెస్టుతో బ్యారేజీ బ్లాకుల్లో కుంగుబాటుకు కారణాలు తెలిసే అవకాశం ఉంది.







