శనగ పంట( Bengal gram crop ) ప్రధాన పప్పు ధాన్యాల పంటలో ఒకటి.వాతావరణంలోని మంచు, తేమ ఉపయోగించుకొని దిగుబడి ఇచ్చే పంటగా శనగ పంటను చెప్పుకోవచ్చు.
అయితే చీడపీడలు ఆశించి తీవ్ర నష్టం కలిగే పంటలలో శనగ పంట కూడా ఒకటి.వాతావరణం లో మార్పులు జరిగితే ఖచ్చితంగా చీడపీడలు శనగ పంటను ఆశిస్తాయి.
కాబట్టి శనగ పంటను పండించే రైతులు ( Farmers )ఎప్పటికప్పుడు పంటను గమనిస్తూ ఉండి, ఏమైనా చీడపీడలు ఆశిస్తే తొలి దశలోనే అరికట్టే చర్యలు చేపట్టాలి.శనగ పంటను వర్షాధార పంటగా సాగు చేస్తారు.
నల్లరేగడి భూములు శనగ పంటకు అనుకూలంగా ఉంటాయి.

శనగ పంటను ఆశించి తీవ్ర నష్టం కలిగించే చీడపీడల విషయానికి వస్తే.రబ్బరు పురుగులు, శనగపచ్చ పురుగులు కీలక పాత్ర పోషిస్తాయి.వీటితో పాటు ఎండు తెగుళ్లు, వేరుకుళ్ళు తెగుళ్లు కూడా శనగ పంటకు తీవ్ర నష్టం కలిగిస్తాయి.
రబ్బరు పురుగులను అరికట్టేందుకు.ఇమామెక్టిమ్ బెంజోయెట్+ నోవాల్యూరాన్ 1.6మి.లీ లేదా ఇండాక్సోకార్బ్+ నోవాల్యూరాన్ 1.6మి.లీ ను ఒక లీటరు నీటిలో కలిపి మొక్కలు పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేయాలి.

శనగపచ్చ పురుగులను అరికట్టేందుకు.క్లోరాంట్రినిలి ప్రోల్ 0.3మి.లీ లేదా ల్యామ్డాసైహూలిత్రిన్ 1మి.లీ ను ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.ఈ పురుగుల నివారణ కోసం ఒక ఎకరం పొలంలో నాలుగు లింగాకర్షణ బుట్టలు అమర్చుకోవాలి.
వేరు కుళ్ళు( Root Wilt Disease ) నివారణ కోసం.మూడు గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ ను పిచికారి చేయాలి.
ఎండు తెగుళ్ల నివారణ కోసం.ప్లోకోరోజ్ 1.5గ్రా ను ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.లేదంటే టెబుకొనజోల్ 1మి.లీ ను ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.ఈ చీడపీడలను, తెగుళ్లను సకాలంలో గుర్తించి సంరక్షక పద్ధతులు చేపడితే ఆశించిన స్థాయిలో దిగుబడులు పొందవచ్చు.







