ఏపీ సీఎం జగన్ మరికాసేపటిలో లోటస్‌పాండ్‌కు వెళ్లనున్నారు.ఈ మేరకు లోటస్‌పాండ్‌లో ఉన్న వైఎస్ విజయమ్మను ఆయన కలవనున్నారు.
దాదాపు మూడేళ్ల తరువాత సీఎం జగన్ లోటస్‌పాండ్‌కు వెళ్తున్నారు.
అయితే సీఎం జగన్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పరామర్శించేందుకు హైదరాబాద్ కు వచ్చిన సంగతి తెలిసిందే.
బంజారాహిల్స్ లోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన సీఎం జగన్ కు మాజీ మంత్రి కేటీఆర్ ఆహ్వానం పలికారు.ఈ క్రమంలో కేసీఆర్ ను పరామర్శించిన సీఎం జగన్ ఆయన ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
మరో గంట సమయం పాటు అక్కడే ఉండనున్న సీఎం జగన్ కేసీఆర్ తో లంచ్ చేయనున్నారు.లంచ్ కార్యక్రమం తరువాత సీఎం జగన్ లోటస్‌పాండ్‌కు వెళ్లనున్నారని సమాచారం.







