తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయి ని పెంచిన దర్శకుల్లో రాజమౌళి ( Rajamouli )మొదటి స్థానంలో ఉంటాడు.అయితే ఈయన ఇద్దరు హీరోలను పెట్టుకొని చేసిన త్రిబుల్ ఆర్ సినిమా 1200 కోట్లు కలక్షన్స్ ని మాత్రమే రాబట్టింది.ఇక అదే క్రమంలో ప్రశాంత్ నీల్ చేసిన కెజీఎఫ్ 2 ( KGF 2 )సినిమా 1200 కోట్ల కలక్షన్లు రాబట్టింది.150 కోట్లతో తెరకెక్కిన కే జి ఎఫ్ 2 సినిమా 1200 కోట్లను రాబడితే, 300 కోట్లతో తెరకెక్కిన త్రిబుల్ ఆర్ కూడా 1200 కోట్లే రాబట్టింది ఇక దీంట్లో కెజిఎఫ్ సినిమా భారీ సక్సెస్ అయిందనే చెప్పాలి.త్రిబుల్ ఆర్ సినిమా సక్సెస్ అయినప్పటికీ కలక్షన్ల పరంగా చూసుకుంటే త్రిబుల్ ఆర్ కంటే కే జి ఎఫ్ 2 నే భారీ సక్సెస్ అయిందని చెప్పాలి.

త్రిబుల్ ఆర్ సినిమాకి కేజిఎఫ్ కంటే బడ్జెట్ ఎక్కువ అలాగే ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు ఉన్నారు.అయినప్పటికీ ఒక యశ్( Yash ) లాంటి సాధారణ హీరోని ఎదుర్కోలేకపోయారు అంటూ సోషల్ మీడియా లో చాలా విమర్శలు అయితే ఎదురవుతున్నాయి.ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ కూడా త్రిబుల్ ఆర్ సినిమాకి భారీ కలక్షన్స్ తెప్పించడంలో ఫెయిల్ అయ్యాడు.

నిజానికి ఈ సినిమాలో కొన్ని ఇల్లాజికల్ సీన్స్ వల్లనే త్రిబుల్ ఆర్ సినిమా అనేది భారీ సక్సెస్ ను కొట్టలేకపోయింది అంటూ పలువురు సినిమా మీద పలురకాల కామెంట్లు అయితే చేస్తున్నారు.నిజానికి కెజీఎఫ్ 2 లాంటి ఒక సినిమాని ఓడించలేదు అంటే ఈ విషయం నిజంగా తెలుగు వాళ్ళకి సిగ్గు చేటనే చెప్పాలి…చూడాలి మరి నెక్స్ట్ వచ్చే మహేష్ బాబు సినిమాతో అయిన అన్ని రికార్డ్ లు బ్రేక్ చేస్తాడా లేదో చూడాలి…
.







