బీజేపీ అడుగులకు మడుగులు ఒత్తే పార్టీ కాంగ్రెస్..: హరీశ్ రావు

తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ, కాంగ్రెస్ తీరని అన్యాయం చేస్తున్నాయని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు.బీజేపీ అడుగులకు మడుగులు ఒత్తే పార్టీ కాంగ్రెస్ అని ధ్వజమెత్తారు.

 Congress Is The Party That Is Stepping On Bjp's Feet..: Harish Rao-TeluguStop.com

గిరిజన యూనివర్సిటీ, కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామని బీజేపీ మోసం చేసిందని హరీశ్ రావు ఆరోపించారు.రూ.2 లక్షల రుణమాఫీ చేసిన తరువాతే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడగాలని తెలిపారు.అధికారంలోకి రాగానే ఉచిత కరెంట్ అని మాట తప్పారని మండిపడ్డారు.రైతుభరోసా రూ.15 వేలు ఇస్తామని చెప్పి రూ.10 వేలు కూడా ఇవ్వలేదన్నారు.కానీ బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కరోనా వచ్చినా కూడా రైతుబంధును ఆపలేదని చెప్పారు.

ఈ నేపథ్యంలో హామీలను అమలు చేయాలని ప్రజల తరపున గుర్తు చేస్తున్నామని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube