ఏపీలో గత కొన్ని రోజులుగా అంగన్వాడీల సమ్మె కొనసాగుతున్న సంగతి తెలిసిందే.అంగన్వాడీల నిర్వహిస్తున్న సమ్మెపై ఏపీ ప్రభుత్వం తీవ్రంగా మండిపడింది.
ఈనెల 5వ తేదీ లోపు విధులకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది.అంగన్ వాడీ కార్యకర్తలకు విధులకు హాజరుకానీ పక్షంలో శాఖాపరమైన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.
అంగన్వాడీ కార్యకర్తల సమ్మె కారణంగా అంగన్వాడీ కేంద్రాలలో గర్భిణీ స్త్రీలు, పసి పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న రాష్ట్ర సర్కార్ కార్యకర్తలు విధులకు హాజరుకావాలని విజ్ఞప్తి చేసింది.