అంగన్‎వాడీల సమ్మెపై ఏపీ ప్రభుత్వం సీరియస్

ఏపీలో గత కొన్ని రోజులుగా అంగన్‎వాడీల సమ్మె కొనసాగుతున్న సంగతి తెలిసిందే.అంగన్‎వాడీల నిర్వహిస్తున్న సమ్మెపై ఏపీ ప్రభుత్వం తీవ్రంగా మండిపడింది.

ఈనెల 5వ తేదీ లోపు విధులకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది.అంగన్ వాడీ కార్యకర్తలకు విధులకు హాజరుకానీ పక్షంలో శాఖాపరమైన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.

అంగన్‎వాడీ కార్యకర్తల సమ్మె కారణంగా అంగన్‎వాడీ కేంద్రాలలో గర్భిణీ స్త్రీలు, పసి పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న రాష్ట్ర సర్కార్ కార్యకర్తలు విధులకు హాజరుకావాలని విజ్ఞప్తి చేసింది.

చిరంజీవి బ్లాక్ బస్టర్ సినిమాలకు సీక్వెల్స్… ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన అశ్విని దత్!