నందమూరి హీరో ఖాతాలో చెత్త రికార్డ్.. ఆ సినిమాకు జీరో కలెక్షన్స్ వచ్చాయంటూ?

నందమూరి చైతన్య కృష్ణ ( Nandamuri Chaitanya Krishna )గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఈ ఏడాది బ్రీత్ సినిమాతో చైతన్యకృష్ణ ప్రేక్షకుల ముందుకు వచ్చారనే సంగతి తెలిసిందే.

 Nandamuri Chaitanya Krishna Worst Record Details Here Goes Viral In Social Media-TeluguStop.com

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు.డిసెంబర్ నెల మొదటివారంలో ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కాగా ఆ సమయంలో థియేటర్లలో యానిమల్ సినిమా ప్రభంజనం కొనసాగడంతో ఈ సినిమాను ఎవరూ పట్టించుకోలేదు.

Telugu Bala Krishna, Breathe, Nandamuri, Tollywood-Movie

అయితే బ్రీత్ సినిమా( Breathe Movie ) ఏకంగా 4 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కగా చాలా చోట్ల థియేటర్ల రెంట్ తో పోల్చి చూస్తే ఈ సినిమా కలెక్షన్లు తక్కువగా ఉన్నాయి.థియేటర్లకు ఎదురు డబ్బులు చెల్లించి ఈ సినిమాను ఆడించాల్సి వచ్చిందని కొన్నిచోట్ల షోలు క్యాన్సిల్ అయ్యాయని సమాచారం.మరో విధంగా చెప్పాలంటే ఈ సినిమాకు జీరో కలెక్షన్స్ వచ్చాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.నందమూరి చైతన్య కృష్ణ బ్రీత్ సినిమాతో సక్సెస్ సాధిస్తాడని ఫ్యాన్స్ భావించగా ఈ విధంగా జరగడం ఫ్యాన్స్ ను ఎంతగానో బాధ పెడుతోంది.

నందమూరి చైతన్యకృష్ణ తర్వాత ప్రాజెక్ట్ లతో భారీ విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.ఈతరం ప్రేక్షకులకు నచ్చే కాన్సెప్ట్ లను ఎంచుకుంటే చైతన్యకృష్ణకు కెరీర్ పరంగా ప్లస్ అవుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.</br

Telugu Bala Krishna, Breathe, Nandamuri, Tollywood-Movie

మరి కొందరు చైతన్యకృష్ణకు సినిమా రంగం అచ్చిరాలేదని కామెంట్లు చేస్తున్నారు.నందమూరి చైతన్యకృష్ణ వరుసగా ఇంటర్వ్యూలు ఇచ్చి తన సినిమాను వార్తల్లో నిలుపుతున్నారు.నందమూరి చైతన్యకృష్ణ ఇతర నందమూరి హీరోలతో కలిసి నటిస్తే బాగుంటుందని మరి కొందరు చెబుతున్నారు.ఈ కామెంట్లపై చైతన్యకృష్ణ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.నందమూరి హీరో చైతన్యకృష్ణ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేయాలని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube