డిస్కౌంట్ చలాన్ల అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఇంకా 8 రోజులు మాత్రమే ఉంది.జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్( SP Akhil Mahajan )రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla )లో ఈ చాలన్ పెండింగ్ ఉన్న వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ రాయితీ ప్రకటించడం జరిగింది.
ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు తేదీ: 10-01-2024 లోపు సద్వినియోగం చేసుకోవడానికి ఇంకా 08 రోజులు మాత్రమే ఉన్నది అన్ని జిల్లా ప్రజలు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు.తేదీ: 10-01-2024 వరుకు ట్రాఫిక్ చాలన్ రాయితీ వర్తిస్తుంది.
ద్విచక్ర & త్రి చక్ర వాహనలకు 100% శాతం రాయితీ.ఆర్టీసీ బస్సులు 90% శాతం రాయితీ.నాలుగు చక్రాల వాహనాలకు, లారీలకు, భారీ వాహనాలకు 60% శాతం రాయితి.ఈ చాలన్ డబ్బులు పెండింగ్ ఉన్న వాహనదారులు ఆన్ లైన్ ద్వారానే పెండింగ్ చలాన్ డబ్బులు చెల్లించాలి.
చెల్లింపులు అన్ని ఆన్ లైన్ ద్వారా చేసుకోవాలి. https://echallan.tspolice.gov.in/publicview/ తెలంగాణ ఈ చాలన్ వెబ్ సైట్ లో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
లేదా ఆన్లైన్ అనగా ఫోన్ పే & పే టీం ఏం & గూగుల్ పే , మీ సేవ,ఈ సేవ లో చెలించవచ్చు.ఈ చాలన్ పెండింగ్ ఉన్న వాహనదారులు 2023 డిసెంబర్ 26 నుంచి 2024 జనవరి 10వ తేదీ వరకు డిస్కౌంట్ చలానాల చెల్లింపునకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, వాహనాలపై ఎలాంటి జరిమానా లేకుండా చూసుకోవాలని జిల్లా ఎస్పీ తెలిపారు.







