ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.బెస్తవారిపేట మండలం చెట్టిచర్ల సమీపంలో బొలెరో వాహనం, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి.
ఈ ప్రమాదంలో ముగ్గురు మృత్యువాత పడ్డారు.
మృతులు అంతా పాపాయిపల్లి గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
అనంతరం ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదం చోటు చేసుకోవడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.







