ప్రశాంత్ వర్మ ( Prashanth Varma ) దర్శకత్వంలో తేజ సజ్జ ( Teja Sajja ) హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి చిత్రం హనుమాన్( Hanuman) ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలకు హాజరు అవ్వడమే కాకుండా ఈ సినిమా నుంచి టీజర్ ట్రైలర్ విడుదల చేయగా సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేశాయి.

ఇకపోతే ఈ సినిమా ట్రైలర్ చివరిలో ఒక్కసారిగా ఆంజనేయ స్వామి కళ్ళు తెరిచినటువంటి సన్నివేశాలను చూపిస్తారు.ఈ సన్నివేశం కనుక చూస్తే ఈ సినిమాలో ఆంజనేయ స్వామి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) నటించారన్న భావన ప్రతి ఒక్కరికి కలుగుతుంది.ఆ కళ్ళు అచ్చం చిరంజీవి గారి కళ్ళు మాదిరిగానే ఉన్నాయని అందరూ భావిస్తున్నారు.మరి నిజంగానే ఈ సినిమాలో చిరంజీవి గారు ఆంజనేయ స్వామి పాత్రలో నటిస్తున్నారా లేదా అన్న విషయం గురించి ఇటీవల డైరెక్టర్ ను ప్రశ్నించారు.

ఆంజనేయస్వామి కళ్ళు తెరిచే సన్నివేశంలో అచ్చం మెగాస్టార్ చిరంజీవి గారి లాగా ఉన్నారు.ఆయన కూడా ఈ సినిమాలో నటిస్తున్నారా అన్న ప్రశ్న ప్రశాంత్ వర్మకు ఎదురు కావడంతో ఈ ప్రశ్నకు ప్రశాంత్ వర్మ సమాధానం చెబుతూ అక్కడ ఆంజనేయ స్వామి పాత్రలో ఎవరు నటించారు అనే విషయాన్ని నేను చెప్పను మీరు థియేటర్లోనే చూడాల్సి ఉంటుందని తెలిపారు.ఈ సినిమా కోసం రెండున్నర సంవత్సరాలుగా కష్టపడ్డామని సినిమా ఎంతో అద్భుతంగా వచ్చిందని ప్రశాంత్ వర్మ తెలిపారు అయితే ఆంజనేయ స్వామి పాత్రలో నటించినటువంటి వారు ఎవరు అనే విషయాలను ప్రశాంత్ వర్మ రివీల్ చేయకపోవడమే కాకుండా థియేటర్ లోనే చూడాలి అని చెప్పడంతో కచ్చితంగా ఇక్కడ చిరంజీవి గారి నటించి ఉంటారని పలువురు భావిస్తున్నారు.