తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండే చాలామంది నటులు వాళ్ళకంటూ ప్రత్యేకత ను ఏర్పాటు చేసుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు.ఇక అందులో భాగంగానే స్టార్ హీరో గా పేరు సంపాదించుకున్న ప్రభాస్ ( Prabhas ) తనదైన రీతిలో మంచి సినిమాలు చేస్తూ మంచి పేరు సంపాదించుకున్నాడు.
ఇక అందులో భాగంగానే ప్రభాస్ హీరో గా ప్రశాంత్ నీల్( Prashanth Neel ) దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమాలో తనకంటు ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకొని ప్రేక్షకు లోకానికి చూపించాడు.దాంతో ఆయన మేనరిజానికి ఆయన కటౌట్ కి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.

ఇక సలార్ మూవీ( Salaar ) సక్సెస్ మీద స్పందించిన ఆ సినిమా దర్శకుడు అయిన ప్రశాంత్ నీల్ తనకంటూ ఒక మంచి హిట్ ను అందించారంటు ప్రేక్షకులను పొగడమే కాకుండా ఆయన చేసిన కూడా ప్రతి సినిమా ప్రతి ప్రేక్షకుడికి నచ్చే విధంగానే చేయాలనే కోరుకుంటాను అందుకే దానికి తగ్గట్టుగానే ఎలివేషన్స్ ఇస్తూ సినిమాని ఆధ్యాంతం ప్రేక్షకులకు బోర్ కొట్టించకుండా నడిపించడానికి నా వంతు ప్రయత్నం చేస్తూ ఉంటాను అని చెప్పాడు.నిజానికి ప్రశాంత్ నీల్ చెప్పినట్టుగానే ఆయన సినిమాలో బోరింగ్ సీన్ లు ఏమి ఉండవు.

ఆధ్యాంతం ఎలివేషన్స్, ఎమోషన్స్ తో సాగుతూ ఉంటాయి.ముఖ్యంగా కేజీఎఫ్ లో( KGF ) మనం ఇలాంటి సీన్లు చాలానే చూసాం అయినప్పటికీ ఈ సినిమాలో కూడా ఎలివేషన్స్ ఇవ్వడంలో ఏ మాత్రం తగ్గకుండా తనదైన రీతిలో ప్రభాస్ లాంటి ఒక స్టార్ హీరోను గొప్ప రేంజ్ లో చూపించే ప్రయత్నం చేశాడు అతను అనుకున్నట్టుగానే చూపించి సక్సెస్ కూడా అయ్యాడు…ఇక దాంతో అటు ప్రభాస్ కి ఇటు ప్రశాంత్ నీల్ కి ఒక సూపర్ సక్సెస్ దక్కిందనే చెప్పాలి…ఇక దీంతో వాళ్ళు ఫ్యూచర్ లో ఇంకా మంచి సినిమాలు తీసే అవకాశాలు కూడా ఉన్నాయి…
.







