ఏపీ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలలో 240 లెక్చరర్ పోస్టులకు నోటిఫికేషన్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో( Andhra Pradesh ) మరో మూడు నెలలలో ఎన్నికలు రాబోతున్నాయి.ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం వరుస పెట్టి నోటిఫికేషన్లు విడుదల చేయడం సంచలనంగా మారింది.

 Notification For 240 Lecturer Posts In Ap Govt Degree Colleges Details, Appsc,-TeluguStop.com

త్వరలోనే డీఎస్సీ( DSC ) సంబంధించి కూడా నోటిఫికేషన్ విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది.ఇటీవల మంత్రి బొత్స సత్యనారాయణ( Botsa Satya Narayana ) మీడియాతో మాట్లాడుతూ రెండు మూడు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ పై స్పష్టమైన నిర్ణయం వస్తుందని అన్నారు.

ఈ డీఎస్సీ పై చర్చలు జరుగుతున్నట్లు కూడా వ్యాఖ్యానించారు.సీఎం జగన్( CM Jagan ) విధానపరమైన నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

కాగా కొద్ది రోజుల క్రితం దేవాదాయ శాఖలో ఒప్పంద ప్రాతిపాదికన.పలు ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా ఒప్పంద ప్రాతిపదికన 70 ఏఈఈ, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.

ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీలలో 240 లెక్చరర్ పోస్టుల( 240 Lecturer Posts ) భర్తీకి ఏపీపీఎస్సీ( APPSC ) నోటిఫికేషన్ కి సంబంధించి ప్రకటన చేయడం జరిగింది.ఉద్యోగాలకు అర్హత, వయస్సు, జీతం తదితర పూర్తి వివరాలు జనవరి 24 లోపు https://psc.ap.gov.in/ లో అందుబాటులో ఉంచనుంది.అభ్యర్థులు జనవరి 24 నుంచి ఫిబ్రవరి 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.కాగా ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో 47, పాలిటెక్నిక్ కళాశాలలో 99 లెక్చరర్ పోస్టులకు ఆల్రెడీ నోటిఫికేషన్ విడుదల చేయడం తెలిసిందే.ఈ క్రమంలో డిగ్రీ కాలేజీలకు( Degree Colleges ) సంబంధించి తాజాగా ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటన చేయడంతో ఏపీలో నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube