ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన నల్గొండలోని( Nalgonda ) త్రిపురారం మండలం బాబుసాయి పేట గ్రామంలో చోటు చేసుకుంది.అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.
మిర్యాలగూడ డి.ఎస్.పి వెంకటగిరి తెలిపిన వివరాల ప్రకారం.బాబుసాయి పేట గ్రామంలో కొండమీది సైదయ్య, వెంకటమ్మ అనే దంపతులు నివాసం ఉంటున్నారు.
వీరికి నలుగురు కుమార్తెలు ఒక కుమారుడు సంతానం.ఈ దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
వీరి నాలుగవ కుమార్తె స్వాతికి నిడమనూరు మండలం ఇండ్ల కొట్టయ్య గూడెం( Kottayya Goodem ) గ్రామానికి చెందిన వ్యక్తితో ఐదేళ్ల క్రితం వివాహం జరిగితే. కుటుంబ కలహాల కారణంగా స్వాతి రెండేళ్ల క్రితం పుట్టింటికి వచ్చి తల్లిదండ్రులతో కలిసి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది.

గురువారం స్వాతి తల్లిదండ్రులతో కలిసి కూలి పనులకు వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చింది.గురువారం రాత్రి తల్లిదండ్రులతో కలిసి భోజనం చేసిన స్వాతి మేకల కొట్టంలో మంచం పై నిద్రించింది.ఆమె తల్లిదండ్రులు పూరిపాకలో నిద్రించారు.శుక్రవారం ఉదయం సైదయ్య, వెంకటమ్మలు మేకల కొట్టం వద్దకు వెళ్లి చూడగా స్వాతి ఉలుకు పలుకు లేకుండా విగత జీవిలా పడిఉంది.

గ్రామస్తులు పోలీసులకు( police ) సమాచారం అందించడంతో మిర్యాలగూడ డి.ఎస్.పి వెంకటగిరి తో పాటు పోలీసుల బృందం ఘటన స్థలాన్ని పరిశీలించారు.ఆ తరువాత మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
పోలీసులు స్వాతి మృతి పై తల్లిదండ్రులను ఆరా తీయగా.తమ కుమార్తె మరణం పై అనుమానం ఉందని ఫిర్యాదు చేశారు.
అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత మేకల కొట్టంలోకి ఎవరో వ్యక్తి వచ్చినట్లు, స్వాతి ఆ వ్యక్తితో గొడవ పడినట్లు గ్రామంలో గుసగుసలు వినిపిస్తున్నాయి.అర్ధరాత్రి దాటిన తర్వాత స్వాతి వద్దకు వచ్చిన వ్యక్తి ఎవరో తెలిస్తే అనుమానాస్పద మృతా లేదంటే హత్యనా( Murder ) అనే విషయం తేలుతుంది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్య కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.పోస్ట్ మార్టం ( Post mortem )నివేదిక వచ్చిన తర్వాత కేసుకు కొంచెం కొలికి వచ్చే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.