తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభయహస్తం గ్యారెంటీల పథకం అమలుకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది.ఈ మేరకు ప్రజాపాలన సభలకు ప్రజలు బారులు తీరారు.
అధికారులు ఏర్పాటు చేసిన కౌంటర్లలో క్యూ లైన్లలో నిల్చుని దరఖాస్తులను సమర్పిస్తున్నారు.కాగా వంద రోజుల్లోపు ఆరు గ్యారెంటీలను అమలు చేయాలనే ఉద్దేశంతో ప్రజా పాలన సభలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం.కాగా ఈ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఇవాళ్టి నుంచి జనవరి 6 వ తేదీ వరకు కొనసాగనుంది.