ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నా, కటిక పేదరికంలో ఉన్న కొంతమంది మాత్రం నిజాయితీ చూపించే ఆశ్చర్యపరుస్తుంటారు ఇతరులకు వీరు ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తుంటారు.తాజాగా ఆస్ట్రేలియా( Australia )లోని మెల్‌బోర్న్‌లో ఓ ట్యాక్సీ డ్రైవర్ ఓ కస్టమర్‌కు పెద్ద మొత్తంలో డబ్బు తిరిగి ఇచ్చి తన నిజాయితీని చాటుకున్నాడు.
టాక్సీ డ్రైవర్ చరణ్జిత్ సింగ్ అత్వాల్ ( Charanjit Singh Atwa )అనే సిక్కు వ్యక్తి.అతను 30 సంవత్సరాలకు పైగా టాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

రీసెంట్‌గా, అతను తన టాక్సీ వెనుక సీటులో సుమారు 8,000 ఆస్ట్రేలియన్ డాలర్లు (సుమారు రూ.4.53 లక్షలు) కనుగొన్నాడు.ఆ డబ్బు తనతో తీసుకెళ్లడం మరిచిపోయిన కస్టమర్‌కు చెందినది.
అత్వాల్ డబ్బును తన కోసం ఉంచుకోవాలని ఆలోచించలేదు.కావాలనుకుంటే అతడు ఆ డబ్బును ఉంచేసుకోవచ్చు, తనపై అనుమానం కూడా వచ్చి ఉండేది కాదు.
కానీ ఇతరుల సొమ్ము తనకి వద్దని అవి దక్కాల్సిన వ్యక్తికే దక్కాలని భావించి అతను పోలీసు స్టేషన్‌కు డబ్బు తీసుకెళ్లాడు చివరికి యజమానికి తిరిగి ఇచ్చాడు.

కానీ అతని నిజాయితీకి యజమాని ఎటువంటి ప్రతిఫలం ఇవ్వలేదు.తనకు ఎలాంటి రివార్డు అవసరం లేదని అత్వాల్ అన్నారు.సరైన పని చేసినందుకు సంతోషించాడు.
అతని కథ ఇంటర్నెట్( Internet )లో బాగా పాపులర్ పొందింది.చాలా మంది అతని చిత్తశుద్ధి, దయను ప్రశంసించారు.ఇతరులకు ఆదర్శంగా నిలిచారని వారు పేర్కొన్నారు.“చాలా మంచి పని చేశారు డ్రైవర్ గారు మిమ్మల్ని చూసి మరి కొంతమంది కూడా ఇలాంటి పనులు చేస్తారు.” అని ఒక యూజర్ కామెంట్ పెట్టారు.దేవుడు ఇలాంటి వ్యక్తులను చల్లగా చూడాలని మరికొందరు అన్నారు.







