గత రెండు రోజులుగా కోలీవుడ్ హీరో విశాల్ ( Vishal ) ఓ అమ్మాయితో కలిసి న్యూయార్క్ వీధుల్లో తిరుగుతూ కెమెరా కంటికి చిక్కిన వీడియో సోషల్ మీడియాలో ( Social media )ఎంతగా వైరల్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అయితే విశాల్ కి ఇంకా పెళ్లి కాకపోయినందువల్ల విశాల్ తన ప్రేయసితో ఎవరికి తెలియకుండా న్యూయార్క్ ( Newyark ) వీధుల్లో చక్కర్లు కొడుతున్నారు అంటూ ఈ వీడియో పై కొంతమంది జనాలు కామెంట్లు పెట్టారు.
ఇక మరి కొంతమందేమో అది ప్రమోషన్ కోసం పెట్టారని, ఇంకొంత మందేమో అలా కనిపిస్తే మొహం దాచుకోవాల్సిన అవసరం ఏముంది ఎక్స్ట్రాలు చేస్తున్నారు అంటూ ఇలా ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు కామెంట్లు పెట్టారు.

అయితే విశాల్ ( Vishal ) గురించి సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్లు కూడా రావడంతో దీనిపై తాజాగా విశాల్ క్లారిటీ ఇచ్చారు.ఆయన మాట్లాడుతూ.గత రెండు రోజులుగా నాకు సంబంధించిన ఒక వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.
అయితే ఆ వీడియో గురించి చాలామంది రకరకాల కామెంట్లు పెడుతున్నారు.ఇక మీరు పెట్టే కామెంట్లలో కొంచెం నిజం ఉంది కొంచెం అబద్ధం ఉంది నేను తిరిగింది నిజంగానే న్యూయార్క్ సిటీనే కానీ ఆ వీడియో మొత్తం ప్రాంక్.
అయితే ఈ విషయం గురించి తన (ట్విట్టర్) ఎక్స్ ఖాతాలో స్పందిస్తూ.మీరందరూ నన్ను క్షమించండి.

ఆ వీడియో గురించి ఇప్పుడు స్పందించాల్సిన అవసరం వచ్చింది.ఆ వీడియో తీసింది న్యూయార్క్ సిటీలోనే కానీ అది మొత్తం ప్రాంక్.ఇక నా పక్కనే ఉన్నది ఎవరో కాదు మా కజిన్.నేను ప్రతి సంవత్సరం నా స్ట్రెస్ మొత్తం పోగొట్టుకోవడం కోసం న్యూయార్క్ వెళుతూ ఉంటాను.అలా ప్రతిసారి కజిన్స్ తో వెళ్తాను.ఇక ఈసారి కూడా అలాగే వెళ్లిన సమయంలో మా కజిన్స్ ఒక ప్రాంక్ తీద్దామని అడిగారు.
అయితే క్రిస్మస్ నాడు ఈ ప్రాంక్ తీయాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు.ఇక ఈ ప్రాంక్ వీడియో కి సంబంధించిన పూర్తి బాధ్యత వాళ్లదే.
వీడియో తీసింది వాళ్లే అలాగే దాన్ని బయటికి రిలీజ్ చేసింది కూడా వాళ్లే.ఇక నాలో ఉన్న ఒక చిన్న పిల్లాడిని బయటకు తీసుకురావడం కోసం ఇలాంటి వీడియో తీసారు ఇది ఒక మంచి అనుభూతి.
అంతేకాకుండా మీరు అనుకుంటున్న ఊహగానాలన్నింటికీ చెక్ పెట్టడానికే ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నాను అంటూ విశాల్ ఆ వీడియో పై ఎట్టకేలకు స్పందించారు.ప్రస్తుతం విశాల్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.







