ఓటర్ల తుది జాబితా గడువును పెంచుతూ సీఈసీ ఆదేశాలు..!!

ఓటర్ల తుది జాబితా గడువును పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది.ఈ మేరకు అభ్యంతరాల స్వీకరణ గడువును జనవరి 12వ తేదీ వరకు పొడిగించింది.

 Cec Orders Extending The Deadline For The Final List Of Voters..!!-TeluguStop.com

జనవరి 17వ తేదీలోగా అభ్యంతరాలను కేంద్ర ఎన్నికల సంఘం పరిష్కరించనుంది.తరువాత జనవరి 22 న ఓటర్ల తుది జాబితాను సీఈసీ విడుదల చేయనుంది.

అయితే మొత్తం 12 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల సంఘం ఈ ఆదేశాలను జారీ చేసింది.బీహార్, హార్యానా, ఏపీ, కర్ణాటక, జార్ఖాండ్, కేరళ, మహారాష్ట్ర, పంజాబ్, ఢిల్లీ, తమిళనాడు, ఉత్తరాఖండ్ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి ఓటర్ల తుది జాబితాకు నిన్నటితో గడువు ముగిసింది.

తాజాగా ఆ గడువును కేంద్ర ఎన్నికల సంఘం జనవరి 12వ తేదీ వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube