ఒక సినిమా హిట్ అవ్వాలి అంటే దాన్ని కంటెంట్ బాగుండి అద్భుతంగా షూట్ చేసి ఒక మంచి ప్రాజెక్ట్ తయారు చేయడం మాత్రమే కాదు ఆ సినిమాకి సరిపడా ప్రమోషన్ చేయడం కూడా చాలా ముఖ్యం అని అనుకుంటారు దర్శకనిర్మాతలు.జనాలకు సినిమా చేరాలంటే ప్రమోషన్ ఒకటే మార్గం అని నమ్మేవారు.
కానీ ఇదంతా గతం… ఇప్పుడు సినిమా అంటే కంటెంట్ మాత్రమే ప్రమోషన్స్ తో సంబంధం లేదు అంటూ ఎలాంటి ఆక్టివిటీస్ లేకుండా సైలెంట్ గా థియేటర్లలో విడుదలై బ్రహ్మాండమైన విజయాలు అందుకుంటున్నారు.మరి అలా సైలెంట్ హిట్ కొట్టిన చిత్రాలు ఏంటి ? ఎందుకు ప్రమోషన్స్ చేయకుండా వందల కోట్ల కలెక్షన్స్ వసూలు చేస్తున్నాయి అనే విషయాన్ని ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఈ వరుసలో ముందుగా చెప్పుకోవాల్సిన చిత్రం సలార్( Salaar ).ప్రభాస్ నటించిన ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించాడు.సినిమా విడుదలకు కొన్ని గంటల ముందు రాజమౌళితో సినిమా యూనిట్ చేసిన ఒక ప్రమోషన్ ఈవెంట్ తప్ప మరి ఎలాంటి ప్రమోషన్ ఆక్టివిటీస్ చేయలేదు.ప్రి రిలీజ్ ఈవెంట్ లేదు ట్రైలర్ లాంచ్ లాంటివి లేవు ఏ రకమైన ప్రమోషన్స్ కూడా ప్రశాంత్ చేయలేదు.
అయినా కూడా వందల కోట్ల కలెక్షన్స్ సాధించి బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది సలార్.ఇదే దోవలో లియో ( Leo )చిత్రం కోసం కూడా విజయ్ ఎలాంటి ప్రమోషన్ ఆక్టివిటీస్ చేయలేదు.
మొదట ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అయినా చేద్దామనుకున్నప్పటికీ పర్మిషన్ దొరకపోవడంతో అది కూడా క్యాన్సిల్ అయింది.ఎలాంటి ఇంటర్వ్యూస్ లేకుండా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి బంపర్ హిట్ కొట్టింది.

ఇక షారుఖ్ ఖాన్ సైతం ఇదే స్టాటజీ ఫాలో అయ్యాడు తన డంకీ సినిమా( Dunki ) కోసం.ఈ సినిమా కూడా ఇలాంటి ప్రమోషన్ ఆక్టివిటీస్ జరగలేదు.భారీ హీట్ అయితే కాలేదు కానీ డీసెంట్ కలెక్షన్స్ ని రాబట్టడంతో ఈ సినిమా హిట్ అనే అనుకోవాల్సిందే.రిలీజ్ కి ముందు ఒక టీం ఇంటర్వ్యూ తప్ప ఎలాంటి ప్రమోషన్ ఆక్టివిటీస్ కోసం షారుఖ్ ఖాన్ తన ఇంట్రెస్ట్ ని చూపించలేదు.
అయినా కూడా కలెక్షన్స్ పరంగా బ్యాడ్ అని మాత్రం అనిపించుకోలేదు.దాంతో చాలామంది మేకర్స్ ప్రమోషన్స్ ని పక్కన పెట్టాలని డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది







