అగ్రరాజ్యం అమెరికాలోని టెక్సాస్ లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో ఆరుగురు మృత్యువాత పడగా ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి.
మృతులు ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీశ్ బంధువులుగా గుర్తించారు.ప్రమాదంలో గాయపడిన బాధితులను ఆస్పత్రికి తరలించారు.
జాన్సన్ కౌంటీలో హైవే 67 పై ప్రమాదం చోటు చేసుకుంది.క్రిస్మస్ వేడుకల నేపథ్యంలో టెక్సాస్ నుంచి అట్లాంటా వెళ్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే పొన్నాడ సతీశ్ పిన్ని, బాబాయ్, వారి కూతురు, మనవడు, మనవరాలు మృత్యువాతపడ్డారు.







