తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న సినిమాలు సంక్రాంతి రెస్ లో( Sankranti Movies ) రిలీజ్ అవ్వడానికి రెఢీ గా ఉన్నాయి.ఇక అందులో భాగంగానే ప్రస్తుతం సంక్రాంతి బరిలో 5 సినిమాలు నిలువగా అందులో అన్ని సినిమాలు కూడా ప్రస్తుతం మంచి ఊపులో ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఇందులో నుంచి ఏ సినిమా కూడా వెనక్కి తగ్గే అవకాశాలు కనిపించడం లేదు.ఇక ఈ విషయం మీద తెలుగు లో టాప్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్న దిల్ రాజ్( Producer Dil Raju ) స్పందిస్తూ కొన్ని సినిమాలు సంక్రాంతి బరిలో వెనక్కి తగ్గితే మంచిది అంటూ ఆయన కామెంట్లు చేశారు.
అయితే గుంటూరు కారం,( Guntur Karam ) సైంధవ్( Saindhav ) లాంటి సినిమాలని దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్టు గా తెలుస్తుంది.అయితే దిల్ రాజు మాట్లాడుతూ తేజ సజ్జ( Teja Sajja ) హీరోగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో వస్తున్న హనుమాన్ సినిమా( HanuMan Movie ) విషయంలో దిల్ రాజు ఇన్వాల్వ్ అయి ఆ సినిమా డేట్ ని పోస్ట్ పోన్ చేసుకుంటే మంచిది అని వాళ్లకు సలహాలు ఇస్తున్నట్టుగా తెలుస్తుంది.

అయితే హనుమాన్ సినిమాకి బదులుగా వేరే హిరో సినిమాని పోస్ట్ పోన్ చేసుకోమంటే బాగుండేది కదా అంటూ ఇప్పుడు సినిమా అభిమానులు అందరూ కూడా దిల్ రాజు పైన నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.అయితే సంక్రాంతి బరి లో 5 సినిమాలు నిలిస్తే అందులో హనుమాన్ సినిమా ఒకటి చిన్న సినిమా కాబట్టి దాన్ని పోస్ట్ పొన్ చేసుకోమని దిల్ రాజు చెప్తున్నాడు.

అదే నాగార్జున గాని, రవితేజని గాని, వెంకటేష్ ని గాని పోస్ట్ పోన్ చేసుకోమని చెప్తే బాగుండేది కదా అంటూ నెటిజన్లు సైతం దిల్ రాజు మీద విపరీతమైన కోపంతో ఉన్నారు…అంటే చిన్న సినిమాకి ఒక న్యాయం పెద్ద సినిమాకి ఒక న్యాయమా అంటూ వాళ్ళు సోషల్ మీడియా లో రచ్చ రచ్చ చేస్తున్నారు…
.







