భారత జట్టు ఈ ఏడాది భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచ కప్( ODI World Cup ) ఫైనల్ మ్యాచ్ తో క్రికెట్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది.ఒక్క ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ మినహా మిగిలిన అన్ని మ్యాచ్లలో భారత జట్టు మెరుగైన ఫలితాలను రాబట్టింది.
ఈ 2023 లో వన్డేల్లో భారత్ అద్భుతంగా రాణించింది.ఇక టీ20 లోను కాస్త పర్వాలేదు అనిపించిన.
టెస్ట్ మ్యాచ్ లలో ఆశించిన స్థాయిలో భారత జట్టు రాణించలేకపోయింది.

టీమిండియా( Team India ) 2023లో మూడు ఫార్మాట్లలో కలిపి ఇప్పటివరకు 65 మ్యాచ్లు ఆడగా.45 మ్యాచ్లలో విజయం సాధించింది.రెండు మ్యాచ్లు డ్రా అయ్యాయి, మరో రెండు మ్యాచులు అసంపూర్తిగా ముగిశాయి.
ఇక కేవలం 16 మ్యాచ్లలోనే భారత్ ఓటమిని చవిచూసింది.ముందుగా టెస్ట్ మ్యాచ్ల( Test Matches ) విషయానికి వస్తే.
భారత జట్టు మొత్తం ఈ ఏడాది ఏడు టెస్ట్ మ్యాచ్లు ఆడింది.ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్లు, వెస్టిండీస్ తో రెండు మ్యాచ్లు ఆడింది.
ఈ ఏడు మ్యాచ్లలో భారత జట్టు మూడు మ్యాచ్లలో విజయం సాధించగా.రెండు మ్యాచ్లు డ్రాగా ముగిశాయి.
రెండు మ్యాచ్లలో భారత్ ఓటమిని చవిచూసింది.

వన్డే ఫార్మాట్( One Day Format ) విషయానికి వస్తే.భారత జట్టు మొత్తం ఈ ఏడాది 35 వన్డే మ్యాచ్లు ఆడింది.అందులో 27 మ్యాచ్లలో విజయం సాధించి, కేవలం ఏడు మ్యాచ్లలో ఓటమిపాలైంది.ఒక మ్యాచ్ రద్దయింది.టీ20 ఫార్మాట్( T20 Format ) విషయానికి వస్తే.భారత్ మొత్తం 23 టీ20 అంతర్జాతీయ మ్యాచులు ఆడింది.అందులో 15 మ్యాచ్లలో విజయం సాధించగా.ఏడు మ్యాచ్లలో ఓడింది.ఒక మ్యాచ్ రద్దయింది.
భారత్ ప్రపంచ కప్ టైటిల్ తృటిలో మిస్ చేసుకున్న.ఓవరాల్ గా చూస్తే మాత్రం అన్ని ఫార్మాట్లలో మెరుగైన ప్రదర్శన కనబరిచింది.







