స్ట్రీట్ ఫుడ్( Street food ) భారతదేశంలోని సూపర్ పాపులర్ అయ్యింది.ముఖ్యంగా ఢిల్లీ, ముంబై వంటి పెద్ద నగరాల్లో స్ట్రీట్ ఫుడ్ తినకుండా ప్రజలు ఉండలేరు.
ఎందుకంటే ఈ వీధి వ్యాపారులు అద్భుతమైన రుచులు, వివిధ రకాల వంటకాలను అందిస్తారు.వారిలో కొందరు కస్టమర్లను ఆకర్షించడానికి, వారి వ్యాపారాన్ని పెంచుకోవడానికి క్రియేటివ్ మార్గాలను కూడా ఉపయోగిస్తారు.
తాజాగా ఒక వీధి వ్యాపారి తెలివైన మార్కెటింగ్ ( Marketing )స్ట్రాటజీతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు.అతనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
రొట్టె, సలాడ్, ఇతర వంటకాలతో సర్వ్ చేసే వెజ్ థాలీ( Vegetarian thali ) కనీసం రూ.100 ఉంటుంది.ఇక సోయా చాప్, మటర్ పనీర్ వంటి ఎక్స్‌ట్రా ఫుడ్స్ కూడా యాడ్ చేస్తే థాలీ మరింత రుచికరంగా మారడమే కాక ధర కూడా ఎక్కువగా పెరుగుతుంది.కానీ ఒక స్ట్రీట్ వెండార్ మాత్రం, ఆ థాలీ కేవలం రూ.5 మాత్రమేనని ప్రకటించాడు దాంతో అతడి షాప్ ముందు చాలా మంది భోజనం ప్రియులు క్యూ కట్టారు.ఒక వ్యక్తి ఇక్కడ ఫుడ్ ఆర్డర్ చేయడంతో పాటు వీడియో రికార్డ్ చేయడం కూడా మొదలుపెట్టాడు.
ఈ బంపర్ ఆఫర్ కారణంగా సదరు వ్యక్తి ఆశ్చర్యపోయాడు.ఇంత తక్కువ ధరకు ఇంత థాలీని ఎలా అమ్మగలనని విక్రేతను అడిగాడు.
అమ్మకందారుడు లాభం గురించి పట్టించుకోనని, కేవలం ప్రజలకు ఆహారం ఇవ్వాలనుకుంటున్నాడని చెప్పాడు.
అయితే, థాలీ మొత్తం లాగించాక సదరు వ్యాపారి అసలు ట్విస్ట్ బయట పెట్టాడు.థాలీ రూ.5 కాదు అని రూ.60.రూ.5 బుకింగ్ అమౌంట్ మాత్రమే అని వ్యాపారి చల్లగా చెప్పాడు, మిగిలిన రూ.55 తిన్న తర్వాత చెల్లించాలని వివరించాడు.దాంతో వీడియో రికార్డ్ చేస్తున్న వ్యక్తి అవాక్కయ్యాడు.కస్టమర్లను ఆకర్షించడానికి, ఊహించిన దాని కంటే ఎక్కువ చెల్లించేలా చేయడానికి విక్రేత చేసిన తెలివైన ట్రిక్ ఇది.ఈ వీడియో ఇంటర్నెట్‌లో చాలా మంది వ్యక్తులను ఆకట్టుకుంది, వారు విక్రేత వ్యూహాన్ని తెలివైనదిగా పేర్కొన్నారు.ఈ థాలీకి 60 రూపాయలు వసూలు చేయడం రీజన్బుల్ గానే ఉందని అందుకే కస్టమర్లు ఎవరు అతనితో గొడవ పెట్టుకోకుండా సరదాగా డబ్బులు కట్టి వెళ్ళిపోతున్నారని మరికొందరు అన్నారు ఈ వీడియోని మీరు కూడా చూసేయండి.