సంక్రాంతి పండుగ సందర్భంగా బడా హీరోల నుంచి చిన్న హీరోల వరకు చాలానే సినిమాలు రిలీజ్ అవుతాయని చెప్పుకోవచ్చు. టాలీవుడ్ ఇండస్ట్రీలో సంక్రాంతి నాడు సినిమాలు రిలీజ్ చేయడం ఒక ఆనవాయితీగా వస్తోంది.అయితే ఒకేసారి ఇన్ని సినిమాలు రిలీజ్ కావడం వల్ల అన్ని సినిమాల కలెక్షన్లపై ప్రతికూల ప్రభావం పడుతుంది.2024లో సంక్రాంతి సందర్భంగా ఈసారి గుంటూరు కారం, సైంధవ్( Saindhav Movie ), ఈగల్, నా సామిరంగా, హనుమాన్ వంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
ఈగల్ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా చేస్తుండగా, టైటిల్ రోల్‌లో రవితేజ నటిస్తున్నాడు.యాక్షన్ థ్రిల్లర్ సైంధవ్ సినిమా వెంకటేష్ 75వ సినిమాగా వస్తోంది.దీనిపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.ఇక గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు హీరోగా చేస్తున్న సంగతి తెలిసిందే.
నా సామిరంగా సినిమా( Naa Saami Ranga )లో నాగార్జున అక్కినేని, ఆషికా రంగనాథ్ నటిస్తున్నారు.హనుమాన్ మూవీలో తేజ సజ్జ, అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్‌కుమార్ నటిస్తున్నారు.
దీనిని ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు.ఈ మూవీలు సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
వాటిలో రెండు సినిమాలు జనవరి 12న, మరో రెండు సినిమాలు జనవరి 13న, ఇంకొక సినిమా జనవరి 14న రిలీజ్ కానుంది.

అయితే జస్ట్ మూడు, నాలుగు రోజుల్లోనే ఐదు సినిమాలు రిలీజ్ కావడం వల్ల థియేటర్లు దొరకడం కష్టమైపోయింది.గుంటూరు కారం సినిమాలో మహేష్ హీరో, త్రివిక్రమ్ డైరెక్టర్ కాబట్టి ఆ సినిమాకి ఈజీగానే థియేటర్లు దొరుకుతున్నాయి.ఇక విక్టరీ వెంకటేష్( Victory Venkatesh ) కు సురేష్ బాబుతో సహా ఏసియన్ సునీల్ సహాయం చేస్తున్నారు కాబట్టి అతడి సినిమా సైంధవ్‌కు కూడా కావాల్సినన్ని థియేటర్లు దొరుకుతున్నాయి.
వెంకటేష్ సైంధవ్‌తో భారీ హిట్ కొట్టాలని చూస్తున్నాడు.అందుకే వీలైనన్ని థియేటర్లను బుక్ చేసుకుంటున్నాడు.మహేష్ బాబు, వెంకటేష్ ఇద్దరూ థియేటర్లను మొత్తం లాక్కుంటుంటే రవితేజ, నాగార్జున మాత్రం బిక్క మొహాలు వేస్తున్నట్లు తెలుస్తోంది.ముఖ్యంగా రవితేజ సినిమాకు థియేటర్లు ఆశించిన స్థాయిలో దొరకడం లేదట.
దాంతో ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్న పీపుల్స్ మీడియా స్వయంగా రంగంలోకి దిగి కొన్ని థియేటర్లతో ముందుగానే అగ్రిమెంట్లు చేయించుకోవడం స్టార్ట్ చేసిందని సమాచారం.ఇక చిన్న హీరోతో వస్తున్న హనుమాన్ సినిమా థియేటర్లు లభించక బాగా సతమతమవుతున్నట్లు టాక్ నడుస్తోంది.
అగ్రిమెంట్ చేసుకోవాలని చూస్తున్నా ఏ థియేటర్ కూడా హనుమాన్ మూవీని రిలీజ్ చేసేందుకు పెద్దగా ఆసక్తి కనబరచడం లేదని వినికిడి.

అయితే ఈ సినిమా విడుదలని వాయిదా వేసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు కానీ అయోధ్యలో రామమందిరి ప్రారంభోత్సవానికి ముందే ఈ మూవీ రిలీజ్ చేయాలని మేకర్స్ బలంగా నిర్ణయించుకున్నారు కాబట్టి థియేటర్ల కోసం అన్వేషించక తప్పడం లేదు.ఈ పోటీలో నాగార్జున నా సామిరంగా సినిమా పరిస్థితి కూడా సేమ్ అలానే తయారయ్యింది.అయితే నాగార్జున, రవితేజ( Nagarjuna Ravi Teja ) తమ సినిమాలను వాయిదా వేసుకోవాలని మేకర్స్ ఒత్తిడి చేస్తున్నారు.
అయినా వారికి తమ సినిమా కంటెంట్ పై బాగా నమ్మకం ఉంది.అందుకే సంక్రాంతి కానుకగా వాటిని తీసుకొచ్చి భారీ హిట్ కొట్టాలని భావిస్తున్నారు.అందువల్ల వెనక్కి తగ్గే సంకేతాలను వారు అస్సలు చూపించడం లేదు.మరి చివరికి నాగార్జున, రవితేజలు థియేటర్లను ఎక్కువగా దక్కించుకోగలరా, సంక్రాంతి నాడే వచ్చి హిట్లు కొట్టగలరా అనేది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.







