పగిలిన పాదాలను రిపేర్ చేసే తేనె.. ఎలా వాడాలో తెలుసా!

పాదాల పగుళ్లు. స్త్రీ పురుషుల్లో చాలా మంది ఫేస్ చేసే కామన్ సమస్య ఇది.అందులోనూ ప్రస్తుత చలికాలంలో పాదాల పగుళ్ల సమస్య మరింత అధికంగా ఉంటుంది.ఇది చిన్న సమస్యే అయినప్పటికీ పగుళ్ల కారణంగా ఒక్కోసారి తీవ్ర అసౌకర్యానికి గురవుతుంటారు.

 How To Get Rid Of Cracked Feet With Honey Cracked Feet, Honey, Home Remedies, La-TeluguStop.com

అలాగే పగుళ్ల వల్ల నడవడానికి ఎంతో బాధాకరంగా ఉంటుంది.మీరు కూడా పాదాల పగుళ్ల‌తో బాధపడుతున్నారా.? అయితే మీకు తేనె చాలా బాగా సహాయపడుతుంది.పగిలిన పాదాలను రిపేర్ చేసే సామర్థ్యం తేనెకు ఉంది.

మరి ఇంతకీ తేనెను ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

పాదాలకు తేనెను అనేక రకాలుగా ఉపయోగించవచ్చు.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె, వన్ టేబుల్ స్పూన్ తేనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పాదాలకు అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.

నైట్ ప‌డుకునే ముందు ఇలా చేసి సాక్స్ ధరించి పడుకోవాలి.ఇలా నిత్యం చేయడం వల్ల పగుళ్లు మాయం అవుతాయి.

పాదాలు మృదువుగా మారతాయి.

Telugu Cracked Feet, Cracked Heels, Honey, Latest, Skin Care, Skin Care Tips-Tel

అలాగే ఓట్స్ తేనె కాంబినేషన్ కూడా పాదాల పగుళ్లను నివారిస్తుంది.అందుకోసం బౌల్ లో రెండు టేబుల్ స్పూన్లు ఓట్స్ పౌడ‌ర్‌ మరియు నాలుగు టేబుల్ స్పూన్లు తేనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని పాదాలకు అప్లై చేసి పది నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

ఆపై సున్నితంగా రబ్ చేస్తూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.రోజుకు ఒక‌సారి ఈ రెమెడీని పాటిస్తే పాదాల పగుళ్లు సమస్య దూరం అవుతుంది.

ఇక ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు అరటి పండు పేస్ట్, రెండు టేబుల్ స్పూన్ల తేనె, రెండు టేబుల్ స్పూన్లు ఆలివ్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని పాదాలకు పట్టించి బాగా మసాజ్ చేసుకోవాలి.20 నిమిషాల అనంతరం పాదాలను క్లీన్ చేసుకోవాలి ఇలా చేసినా కూడా మంచి ఫలితం ఉంటుంది.ఇక మీరు తేనెను డైరెక్ట్ గా కూడా పాదాలకు అప్లై చేయవచ్చు.

తేనెలో ఉండే సుగుణాలు పాదాల పగుళ్లను సమర్ధవంతంగా దూరం చేస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube