యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో సదరన్ ఆన్లైన్ బయోటెక్నాలజీ లిమిటెడ్ సంస్థకు చెందిన బయో డీజిల్ కంపెనీ నుండి సాయంత్రం వేళ వచ్చే దుర్వాసనతో గ్రామ ప్రజలు,ముఖ్యంగా గర్భిణీలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు.ఈ వాసనను కంపెనీ నుండి వెదజల్లే దుర్గంధం బారి నుండి ప్రజలను కాపాడే వారే లేరా అని వాపోతున్నారు.
అఖిలపక్ష నాయకులు ఏకతాటిగా నిలిచి గతేడాది కంపెనీ యాజమాన్యాన్ని ప్రశ్నించగా సమస్యను వారంలో పరిష్కరిస్తామని మాట ఇచ్చారు.
ఏడాది దాటినా నేటికీ సమస్యను పరిష్కరించకుండా మాట తప్పడంతో భయంకరమైన వాసన పీల్చి అనారోగ్యం బారిన పడతామని గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.
ఇంత జరుగుతున్నా బయో యాజమాన్యం దుర్వాసనపై చర్యలు తీసుకోకుండా అడ్డుపడుతున్న శక్తులెవరనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది.ఇప్పటికైనా కంపెనీ యాజమాన్యం తక్షణమే విష వాయువు బారి నుండి ప్రజలకు విముక్తి కల్పించాలని, లేదంటే గ్రమస్తులమే పెద్ద ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరిస్తున్నారు.







