నిత్యం ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో( Social Media ) మనకు కపడుతుంటాయి.కొన్ని వీడియోలను మనలను ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి.
మరికొన్ని మనలో భావోద్వేగాలను రగుల్చుతాయి.ఇంకొన్ని నవ్విస్తుంటాయి.
అందుకే చాలా మంది ఇటీవల కాలంలో సోషల్ మీడియాకు అతుక్కుపోతున్నారు.గంటలు తరబడి సోషల్ మీడియాలో వీడియోలు చూస్తూ గడుపుతున్నారు.
ఆకట్టుకునే వీడియోలకు సోషల్ మీడియాలో ఎక్కువ మంది నెటిజన్లు ఆకర్షితులవుతారు.ఇలా 2023లో ఎక్కువ మంది ఆకట్టుకున్న వీడియోల గురించి తెలుసుకుందాం.
సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన వీడియోల గురించి ఆలోచిస్తే మనకు టక్కున్న కొన్ని గుర్తు వచ్చేస్తాయి.అలా ఈ ఏడాదిలో కొన్ని వీడియోలను నెటిజన్ల హృదయాలలో నిలిచి పోయాయి.
అందులో ఎక్కువ శాతం ప్రేమకు సంబంధించినవే ఉన్నాయి.ముఖ్యంగా తాము ప్రేమించే వారికి లవ్ ప్రపోజల్( Love Proposal Videos ) చేసిన వీడియోలు బాగా ఆకట్టుకున్నాయి.
అందులో ఆక్లాండ్ విమానాశ్రయంలో ఆకట్టుకున్న లవ్ ప్రపోజల్ వీడియో.
ఇక ఈ ఘటనలో ఓ యువకుడు తన ప్రియురాలికి ప్రేమను వ్యక్త పరిచేందుకు ఆక్లాండ్ విమానాశ్రయ అధికారులను సంప్రదించాడు.విమానాశ్రయం వద్దకు బంధువులు, కుటుంబ సభ్యులను పిలిచాడు.ఆ తర్వాత పబ్లిక్ అనౌన్స్మెంట్ బోర్డుపై తన ప్రియురాలికి ప్రపోజ్ చేస్తూ ప్రకటన ఇచ్చాడు.
దీనిని ఆక్లాండ్ విమానాశ్రయం( Auckland Airport ) ట్విటర్ పేజీలో పోస్ట్ చేయడంతో ఎక్కువ మందిని ఈ వీడియో ఆకట్టుకుంది.మరో ఘటనలో ఓ యువతి తన స్నేహితులతో కలిసి షాపింగ్ మాల్లో వెళ్తుంటుంది.
ఆమెను వెనుక నుంచి ఆమె ప్రియుడు ఫాలో అవుతాడు.చివరికి వెనుక నుంచి ఆమెను తట్టి తాను మోకాళ్లపై కూర్చుంటాడు.అతడు చేసిన ప్రపోజ్కు( Propose ) ఆమె సిగ్గుల మొగ్గ అవుతుంది.అతడు ఉంగరాన్ని అందించగా వేలికి తొడగాలని చేయి అందిస్తుంది.ఇలా తన ప్రియుడి లవ్ ప్రపోజ్ను యాక్సెప్ట్ చేస్తుంది.లవ్ ప్రపోజ్ ఇలా చేస్తే తాము ప్రేమించే వారు కాదనలేరనేలా ఈ వీడియోలు ఉన్నాయి.
ఇలాంటివి మరికొన్ని సోషల్ మీడియాలో నెటిజన్లను బాగా ఆకట్టుకున్నాయి.