చెట్లు కిందికి కాకుండా పైకే ఎందుకు పెరుగుతాయో తెలుసా..?

మొక్కలు ఆకాశం వైపు ఎలా పెరుగుతాయి? ఈ డౌట్ చాలామందిలో ఉంటుంది.ఒక విత్తనం వేసినప్పుడు అవి భూమిలోకి వేళ్ళ రూపంలో వెళ్లిపోతాయి.

 Do You Know Why Trees Grow Upwards Instead Of Downwards..? , Plant Growth, Grav-TeluguStop.com

పైకి మాత్రం చెట్టు రూపంలో బయటకు వస్తాయి.ఏ దారి పైకి, ఏ దారి కిందికి ఉందో మొక్కలకు ఎలా తెలుస్తుంది? ప్రతి దానిని క్రిందికి లాగే గురుత్వాకర్షణ శక్తి( Gravity )ని అధిగమించి అవి పైకి ఎలా వెళ్లగలుగుతాయి? ప్రస్తుతం ఈ ప్రశ్నలకు నెటిజన్లు సోషల్ మీడియాలో సమాధానాలు వెతుకుతున్నారు.వాటికి సమాధానం ఏంటో తెలుసుకుందాం పదండి.సాధారణంగా మొక్కలు పెరిగేందుకు గ్రావిట్రోపిజం అనే ప్రత్యేక పద్ధతిని ఉపయోగిస్తాయి.అంటే అవి గురుత్వాకర్షణ దిశను పసిగట్టగలవు, తదనుగుణంగా తమ పెరుగుదలను సర్దుబాటు చేయగలవు.మొక్కల కణాలలో ఆక్సిన్ అనే రసాయనం ఉంటుంది.

ఆక్సిన్ కణాలు వేగంగా, పెద్దగా పెరగడానికి సహాయపడుతుంది.

Telugu Auxin, Botany, Gravitropism, Gravity, Phototropism, Quora, Stem, Tropic-L

ఒక మొక్క నిటారుగా నిలబడి ఉన్నప్పుడు, ఆక్సిన్( Auxin ) కాండంలో సమానంగా పంపిణీ అవుతుంది.ఇది మొక్క స్ట్రైట్ గా ఉన్నప్పుడు అదే వేగంతో పెరగడానికి సహాయం చేస్తుంది.కానీ మొక్క ఒక వైపుకు వంగి ఉంటే, ఆక్సిన్ కాండం దిగువ వైపుకు కదులుతుంది.

దీని వల్ల ఆ వైపు కణాలు పై వైపు కణాల కంటే వేగంగా, పెద్దగా పెరుగుతాయి.కాండం వంగి కొంత పెరిగిన తర్వాత మళ్లీ పైకి లేచి వంపుని స్ట్రైట్ చేస్తుంది.

Telugu Auxin, Botany, Gravitropism, Gravity, Phototropism, Quora, Stem, Tropic-L

మొక్కలు ఎదుగుదలను బట్టి వివిధ రకాల కదలికలను కలిగి ఉంటాయి.పెరుగుదలపై ఆధారపడిన కదలికలను ట్రాపిక్ మూవ్‌మెంట్స్ అంటారు.ఐదు రకాల ట్రాపిక్ మూవ్‌మెంట్స్ ఉన్నాయి: ఫొటోట్రోపిజం( Phototropism ) (కాంతి వైపు కదులుతుంది), జియోట్రోపిజం (నేల వైపు కదులుతుంది), హైడ్రోట్రోపిజం (నీటి వైపు కదులుతుంది), కెమోట్రోపిజం (రసాయనాలకు ప్రతిస్పందనగా కదలడం) మరియు తిగ్మోట్రోపిజం (మద్దతుతో ఎక్కడం).ఈ కదలికలు పర్యావరణంలో వివిధ విషయాలకు మొక్క ప్రతిచర్య వలన సంభవిస్తాయి.

మొక్కలు ఎల్లప్పుడూ సూర్యుని వైపు పెరగవు, దీనిని సాధారణంగా “పైకి” అని కూడా అనుకుంటాం.మనుషులు నేలపై నడవగలట్లే మొక్కలు గురుత్వాకర్షణ శక్తిని అధిగమించగలవు.మొక్కలు వివిధ దిశల్లో పెరగడం వల్లనే అద్భుతంగా ఉంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube