జాతరత్నాలు( Jathi Ratnalu ) సినిమాతో డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనుదీప్ కేవీ ప్రస్తుతం ఒక సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు.అయితే ఇప్పటికే వెంకటేష్ తో ఒక సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నప్పటికీ అది వర్కౌట్ అవ్వడం లేదు.
ఇక దాంతో నవీన్ పోలిశెట్టి ని హీరోగా పెట్టి ఒక సినిమా చేసే పనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది.

ప్రస్తుతం నవీన్ తనదైన రీతిలో మంచి క్యారెక్టర్ ని సెలెక్ట్ చేసుకుంటూ మంచి సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడనే పేరు అయితే సంపాదించుకుంటున్నాడు.ఇక ఇదే రీతిలో కూడా ఆయన ఫ్యూచర్ కి ముందుకు వెళ్తే నవీన్ పోలిశెట్టి ఇండస్ట్రీ లో ఒక స్టార్ హీరో గుర్తింపు పొందుతాడు అనడం లో ఎంత మాత్రం అంతశయోక్తి లేదనే చెప్పాలి.నిజానికి తెలుగు సినిమా హీరోలు అందరు కూడా ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్లు ను చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే నవీన్( Naveen Polishetty ) మాత్రం డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లని చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నాడు.
ఎప్పుడు తను ఇలాగే డిఫరెంట్ క్యారెక్టర్ చేసుకుంటూ ముందుకెళ్తే మాత్రం ఆయన డెఫినెట్ గా ఒక మంచి హీరోగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందుతాడు.

ఇక ఇప్పటికే ఆయన తర్వాత సినిమా మీద కూడా మంచి ఎఫర్ట్ పెడుతున్నట్టుగా తెలుస్తుంది.అయితే ఇప్పుడు అనుదీప్ డైరెక్షన్( Anudeep kv ) లో వస్తున్న సినిమా జాతి రత్నాలు సినిమాకి సీక్వల్ గా వస్తుందా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అనుదీప్ లాంటి డైరక్టర్ తో సినిమా చేస్తే ఆయన క్రేజ్ మరింత పెరిగే అవకాశం కూడా ఉంది…కాబట్టి వీళ్ళ కాంబోలో వస్తున్న ఈ రెండోవ సినిమా మంచి విజయం అందుకోవాలని కోరుకుందాం…
.








