ఎలాంటి అంచనాలు లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు నటి శ్రీ లీల( Sreeleela ).పెళ్లి సందడి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె ఈ సినిమా ద్వారా పెద్దగా కమర్షియల్ గా సక్సెస్ సాధించలేకపోయిన తన లుక్స్ నటన పరంగా మంచి సక్సెస్ అందుకున్నారు.
ఇక ఈ సినిమా తర్వాత ధమాకా సినిమా( Dhamaka movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈమె ఈ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకోవడంతో ఏకంగా 12 సినిమాలకు సంతకం చేశారు.
ఇలా ప్రతి నెల ఈమె నటించిన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.ఇప్పటికే నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాగా ఇందులో ఒక్క సినిమా మాత్రమే సూపర్ హిట్ అందుకొని నిర్మాతలకు లాభాలను తీసుకువచ్చింది మిగిలిన స్కంద, ఆది కేశవ, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ ఈ సినిమాలు మూడు కూడా భారీ స్థాయిలో నిర్మాతలకు నష్టాలను తీసుకువచ్చాయని చెప్పాలి.ఇక ఈ సినిమాలకు కనీసం ఓపెనింగ్స్ కూడా రాకపోవడం విశేషం దీంతో నిర్మాతలు భారీగా నష్టపోయారు.
ఇలా ఈ మూడు నెలల వ్యవధిలోను మూడు సినిమాలు డిజాస్టర్ కావడంతో నిర్మాతలకు సుమారు 100 కోట్ల వరకు నష్టం ఉంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.ఇప్పటివరకు ఏ హీరోయిన్ ఖాతాలో మూడు నెలలలోనే 100 కోట్లు నష్టం తెచ్చినటువంటి రికార్డు లేదని ఈ విధమైనటువంటి చెత్త రికార్డు సొంతం చేసుకున్నటువంటి ఏకైక హీరోయిన్ శ్రీ లీల అని తెలుస్తుంది అయితే ఈమె తదుపరి మహేష్ బాబు( Mahesh Babu ) పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) వంటి స్టార్ హీరోల సినిమాలలో నటిస్తున్నారు ఇక ఈమెకు మహేష్ బాబు మంచి సక్సెస్ కనుక అందించలేకపోతే ఈమె కెరియర్ పూర్తిగా ఇబ్బందులలో పడుతుందని తెలుస్తుంది.మహేష్ బాబు గుంటూరు కారం( Gunturu Kaaram ) సినిమా పైనే శ్రీ లీల సినీ కెరియర్ ఆధారపడి ఉందని చెప్పాలి.