తెలుగులో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఇప్పటికే ఎంతోమంది ఆర్టిస్టులు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన విషయం మనందరికీ తెలిసిందే.అతి తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు.
ఇప్పటికీ జబర్దస్త్ షో కి కొత్త కొత్త ఆర్టిస్టులు ఎంట్రీ ఇస్తూనే ఉన్నారు.అలా ఇటీవల కాలంలో జబర్దస్త్ షోకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో లేడీ కమెడియన్ పవిత్ర( Jabardasth Pavithra ) కూడా ఒకరు.
ఈమె జబర్దస్త్ షో ద్వారా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఒకవైపు జబర్దస్త్ షో అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ( Sridevi Drama Company ) షోలలో చేస్తూనే సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ ని రన్ చేస్తూ బాగానే సంపాదిస్తోంది.ఇది ఇలా ఉంటే తాజాగా పవిత్ర తనకు కాబోయే భర్తను పరిచయం చేస్తూ ఒక రొమాంటిక్ డాన్స్ చేసింది.అందుకు సంబంధించిన వీడియో ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఈమె కొద్ది రోజుల క్రితం తన ప్రేమ విషయాన్ని, పెళ్లి విషయాన్ని పవిత్ర సోషల్ మీడియా ద్వారా అందరికి తెలియజేశారు.సంతోష్ అనే వ్యక్తిని పవిత్ర పెళ్లి చేసుకోబోతున్నారు.
ఇటీవలే నిశ్చితార్థం కూడా జరుపుకున్నారు.పెళ్లి తేదీని ఇంకా తెలియజేయని ఈ జంట ప్రస్తుతం లవ్ లైఫ్ ని మరింత ఎంజాయ్ చేస్తున్నారు.
తాజాగా పవిత్ర ఒక వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశారు.

ఆ వీడియోలో పవిత్ర తన కాబోయే భర్త సంతోష్ తో కలిసి.లోఫర్ మూవీలోని రొమాంటిక్ సాంగ్ జియా జలే సాంగ్ కలిసి డాన్స్ వేశారు.ఆ వీడియోని షేర్ చేస్తూ ఈ విధంగా రాసుకొచ్చింది పవిత్ర.
కొన్ని సిట్యువేషన్స్ లో మనకి డాన్స్ వేయడం రానప్పుడు ఎం చెయ్యాలో తెలుసా, డాన్స్ వచ్చినట్లు మ్యానేజ్ చెయ్యాలి అంటూ వీడియోకు జత చేసింది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అయితే చాలా తన యూట్యూబ్ ఛానల్ లో సంతోష్ ని ఫ్రాంక్ చేస్తూ ఆట పట్టిస్తూ ఎన్నో రకాల వీడియోలను షేర్ చేసింది పవిత్ర.పవిత్రకి సంతోష్( Santosh ) ముందుగా తన ప్రేమని ప్రపోజ్ చేశారు.
కొంత కాలం తరువాత పవిత్ర కూడా ఓకే చెప్పడం, వన్ ఇయర్ లవ్ రిలేషన్ తో తరువాత ఎంగేజ్మెంట్ రింగ్ లు మార్చుకొని పెళ్లి జీవితానికి మొదటి అడుగు వేశారు.మరి ఈ ఇద్దరు ఎప్పుడు ఏడడుగులు వేయబోతున్నారో తెలియాల్సి ఉంది.







