తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ సెవెన్( Bigg Boss Season Seven ) చూస్తుండగానే అప్పుడే ముగింపు దశకు చేరుకుంది.ఇక గ్రాండ్ ఫినాలే దగ్గర పడుతుండడంతో బిగ్ బాస్ షో రోజు రోజుకి మరింత ఆసక్తికరంగా మారుతోంది.
ఇక మరో వారం రోజుల్లో బిగ్ బాస్ షో ముగుస్తుండడంతో హౌస్ లో ఎవరు గెలుస్తారు ఎవరు రన్నరప్ గా నిలుస్తారు అన్న విషయాలు ఆసక్తికరంగా మారాయి.ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లకు వారి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు యాంకర్లు ఆర్టిస్టులు ఓటు వేయమంటూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా చేస్తున్నారు.

ఇన్ స్టాగ్రామ్ లో పల్లవి ప్రశాంత్, శివాజీలకి( Pallavi ,Prashanth and Shivaji ) సపోర్ట్ చేసే వారే ఎక్కువగా కన్పిస్తున్నారు. ఇప్పుడు తాజాగా సీరియల్ యాక్టర్స్, సినిమా తారలు సైతం శివాజీకే ఓట్ చేయమని చెప్తున్నారు.తాజాగా నటి ప్రియ( Actress Priya ) తన ఇన్ స్టాగ్రామ్ లో శివాజీకి సపోర్ట్ చేయండి అంటూ రిక్వెస్ట్ చేసింది.హౌస్ లో జన్యున్ గా ఉండి, టాస్క్ లలో ఉన్న వారితో సమానంగా ఆడుతున్నాడు.
ఫెయిర్ గేమ్ ఆడుతూ ఆట స్థాయిని పెంచుతున్న శివాజీకి ఓట్ చేయండి.ఈ సీజన్-7 శివాజీ కప్ గెలవాలని కోరుకుంటున్నాను.నన్ను అభిమానించే వారు శివాజీకి ఓట్ చేయండి అంటూ ప్రియ తన ఇన్ స్టాగ్రామ్ లో రాసుకొచ్చింది.కాగా ప్రియ బిగ్ బాస్ సీజన్-5 లో ఏడో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఈమె ప్రస్తుతం ఒకవైపు సినిమాల్లో, మరోవైపు టీవీ సీరియళ్లలో( TV serials ) నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది.ఇక ఈమె వెండితెరపై చిరంజీవి నాగార్జున బాలకృష్ణ ప్రభాస్ లాంటి స్టార్ హీరోల సినిమాలలో నటించి మెప్పించింది.ప్రియసఖి సీరియల్‌తో ఉత్తమనటిగా నంది అవార్డును అందుకున్నారు.వాణి రాణి, నందిని వర్సెస్ నందిని, చిన్న కోడలు, నంబర్‌వన్ కోడలు లాంటి సీరియల్స్‌లో ప్రధాన పాత్రలు చేశారు.
ఇటు వెండితెర, అటు బుల్లితెరపై అందమైన క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తుంది ప్రియ.అయితే కృష్ణ ముకుంద మురారి సీరియల్ భవాని పాత్రలో ఆమె నటిస్తూ తెలుగింటి ఆడపడుచులకు ఆదర్శంగా నిలుస్తోంది.
మురారికి పెద్దమ్మగా ఇంటిపెద్దగా కుటుంబాన్ని లీడ్ చేస్తున్న భవాని పాత్రలో ఆర్టిస్ట్ ప్రియ ఒదిగిపోయింది.ఈ సీరియల్ తో ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యింది.







