వీడియో: మూడు కాళ్ల చేపలను ఎప్పుడైనా చూశారా.. వీటి ప్రత్యేకతలు తెలిస్తే..

సముద్ర గర్భంలో ఎన్నో ప్రత్యేకమైన జీవులు నివసిస్తుంటాయి.అక్కడ ఉండే జీవులు చూస్తే స్టన్ అవడం ఖాయం.

 Video: Have You Ever Seen A Three-legged Fish If You Know The Specifics Of These-TeluguStop.com

అదొక వింత ప్రపంచాన్ని తలపిస్తుందని అనడంలో సందేహం లేదు.తాజాగా సముద్ర లోతుల్లో నివసించే ఒక వెరైటీ చేపకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.@gunsnrosesgirl3 ట్విట్టర్ పేజీ( Twitter ) ఈ వీడియోని షేర్ చేసింది.దీనికి ఇప్పటికే మూడు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

ఇదొక ట్రైపాడ్ ఫిష్ అని ట్విట్టర్ పేజీ క్యాప్షన్ లో తెలిపింది.అంతే కాదు దీనికి మూడు కాళ్లు ఉంటాయని కూడా తెలిపింది.

అందుకే ఆ పేరు వచ్చిందని వెల్లడించింది.

ట్రైపాడ్ ఫిష్( Tripod fish ) చాలా ప్రత్యేకమైన జీవి.ఇది సముద్రంలోని మిడ్ నైట్ జోన్‌లో నివసిస్తుంది.కాంతి చేరుకోని మిడ్ నైట్ జోన్‌లో ఈ చేప ఉంటుంది కాబట్టి ఆ కఠినమైన వాతావరణంలో జీవించడంలో సహాయపడటానికి అనేక ప్రత్యేకతలను ఇది డెవలప్ చేసుకుంది.

ఆ అత్యంత అద్భుతమైన లక్షణాలలో ఒకటి దాని పొడవైన, సన్నని రెక్కలు.ఈ రెక్కలు కొన్ని ద్రవాలతో ఫీల్ అయ్యి దృఢంగా కాళ్ళలాగా తయారవుతాయి.వాటి సహాయంతో సముద్రపు ( Sea )అడుగుభాగంలో ఈ చేపలు నిటారుగా నిలబడగలవు.

వైరల్ వీడియో చూసి చాలామంది నెటిజన్లు అబ్బుర పడుతున్నారు.కాళ్లు ఉన్న చేపలను చూడటం ఇదే తొలిసారి అని నోరెళ్ల బెడుతున్నారు.నిటారుగా నిలబడటం ద్వారా, ట్రైపాడ్ ఫిష్ ఎక్కువ ప్రాంతాన్ని చూడగలదు, తద్వారా ఎరను సులభంగా గుర్తించగలుగుతుంది.

ఈ చేప పొడవైన రెక్కలు లోతైన సముద్ర బలమైన ప్రవాహాలలో స్థిరంగా ఉండటానికి సహాయపడతాయి.కాళ్లతో ఈ ప్రయోజనాలు మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో ప్రయోజనాలు చేపకు కలుగుతాయి.

వాటిలో ఒకటి సెన్సరీ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం.ఈ రెక్కలు దట్టంగా నర్వ్‌ ఎండింగ్స్‌తో నిండి ఉంటాయి, ఇవి నీటిలోని చిన్న కదలికలను సైతం గుర్తించగలిగే సామర్థ్యాన్ని చేపలకు అందిస్తాయి.

ట్రైపాడ్ చేపలకు ఇది చాలా అవసరం, ఎందుకంటే మిడ్ నైట్ జోన్‌లో ఏమీ కనిపించని చీకటి ఉంటుంది.ఇలాంటి చీకటిలో ఆహారాన్ని కనుగొనడం కష్టం.

అందుకే ఈ చేప దాని స్పర్శపై ఆధారపడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube