చాలా ఎత్తు నుంచి నీటిలోకి దూకడం చాలా ప్రమాదకరం.ఇక అయిదంతస్తుల ఎత్తు పైనుంచి జంప్ చేస్తే ప్రాణాంతక గాయాలయ్యే ప్రమాదం కూడా ఉంది.
కానీ కొందరు కొన్ని టెక్నిక్స్‌తో చాలా ఎత్తు పైనుంచి స్విమ్మింగ్ పూల్స్ లో( Swimming Pool ) దూకి చిన్న దెబ్బ కూడా తగలకుండా తప్పించుకోగలుగుతారు.తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో కొందరు యువకులు కూడా దాదాపు 5 అంతస్థల ఎత్తున హోటల్ పైనుంచి కింద ఉన్న స్విమ్మింగ్ పూల్ లోకి దూకారు.
ఆ తర్వాత చాలా క్షేమంగా అక్కడి నుంచి పారిపోయారు.

ఈ వీడియోను ప్రముఖ ట్విట్టర్ పేజీ @సీసీటీవీ ఇడియట్స్ షేర్ చేసింది.షేర్ చేసిన సమయం నుంచి దీనికి రెండు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.ఈ వైరల్ వీడియో( Viral Video ) ఓపెన్ చేస్తే మనకు ఒక పోలీస్ సరైన్ బ్యాక్‌గ్రౌండ్ లో వినిపిస్తుంది.
అలాగే హోటల్ రూఫ్ పైన( Hotel Roof ) పరిగెడుతున్న కొందరు యువకులు కనిపిస్తారు.అనంతరం వారు కింద ఉన్న ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ లో దిగుతారు.
ఆపై అందులో నుంచి బయటపడి పారిపోయారు.ఈ దృశ్యాలు చూసేందుకు షాకింగ్‌గా అనిపించాయి.

ఈ వీడియో చూసిన చాలామంది నెటిజన్లు ఇది చాలా డేంజరస్ అని కామెంట్లు చేస్తున్నారు.వారు అంత పెద్ద ఎత్తునుంచి దూకడం వల్ల పూల్‌లో చాలా పెద్ద అలలు వచ్చి ఉంటాయని ఒకరు అన్నారు.కోటి రూపాయలు ఇచ్చినా ఈ పని చేయమని ఇంకొందరు నెటిజన్లు పేర్కొన్నారు.ఇది ఎన్నడూ ఎవరూ ట్రై చేయకూడదని మరికొందరు సలహా ఇచ్చారు.మొత్తం మీద ఈ వైరల్ వీడియో చర్చనీయాంశం అయింది.దీనిపై మీరు కూడా ఒక లుక్కేయండి.







