దక్షిణాఫ్రికా( South Africa ) పర్యటనలో భాగంగా భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ లో భాగంగా నేడు తొలి టీ20 మ్యాచ్ జరగనుంది.టీ20 సిరీస్ ఆడే భారత జట్టు యువ ఆటగాళ్లతో బరిలోకి దిగనుంది.భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్( Suryakumar Yadav ) సారథ్యం వహించనున్నాడు.ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ లో భారత్ 4-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుని ఫుల్ ఫామ్ లో ఉంది.
అదే ఫుల్ ఫామ్ కొనసాగించి నేడు జరిగే మ్యాచ్లో ఘన విజయం సాధించాలని పట్టుదలతో భారత్ బరిలోకి దిగనుంది.ఈ సిరీస్ గెలిచి రెండు టీ20 సిరీస్ లను గెలిపించిన కెప్టెన్ గా సూర్య కుమార్ యాదవ్ మంచి గుర్తింపు పొందాలని ఆరాటపడుతున్నాడు.
ఈ సిరీస్ లో తమ సత్తా ఏంటో చూపించి 2024లో జరిగే టీ20 వరల్డ్ కప్ లో భారత జట్టులో చోటు దక్కించుకోవాలని యువ ఆటగాళ్లంతా భావిస్తున్నారు.టీ20 సిరీస్ ఆడే భారత జట్టులో శుబ్ మన్ గిల్, యశస్వి జైస్వాల్( Yashasvi Jaiswal ) లాంటి ఆటగాళ్లంతా అద్భుతంగా రాణించే అవకాశం ఉంది.ఇక మ్యాచ్ చివరలో అద్భుతం సృష్టించి భారత జట్టుకు విజయం అందించేందుకు ఫినిషర్ రోల్ పోషించడానికి రింకూ సింగ్( Rinku Singh ) ఉన్నాడు.
ఇక భారత జట్టు బ్యాటర్లతో పాటు బౌలర్లు కూడా అనుకున్నా రీతిలో రాణిస్తే టీ20 సిరీస్ భారత్ ఖాతాలో పడుతుంది.టీ20 సిరీస్ ముగిసిన తర్వాత వన్డే, టెస్ట్ సిరీస్లు జరగనున్నాయి.టీ20 మ్యాచ్ రాత్రి 7:00 గంటలకు స్టార్ స్పోర్ట్స్, డిస్నీ+ హాట్ స్టార్ లో ప్రత్యక్ష ప్రసారం అవ్వనుంది.