ప్రధానమంత్రికి మోదీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు.ఈ మేరకు మిగ్ జామ్ తుఫాను ప్రభావంతో నష్టపోయిన ప్రజలను ఆదుకోవాలని లేఖలో కోరారు.
సుమారు 22 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయన్న చంద్రబాబు ప్రాణ, ఆస్తి నష్టం కూడా వాటిల్లిందని లేఖలో పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో జాతీయ విపత్తుగా ప్రకటించి సాయం చేయాలని చంద్రబాబు విన్నవించారు.
అయితే ఇటీవల వచ్చిన మిగ్ జామ్ తుఫాను కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.దాంతో పాటు వేలాది ఎకరాల్లో పంటలు నాశనం కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.







