తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరికాసేపటిలో పార్లమెంట్ కు వెళ్లనున్నారు.ఈ మేరకు ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నారని తెలుస్తోంది.
2019 సార్వత్రిక ఎన్నికల్లో మల్కాజ్ గిరి నియోజకవర్గం నుంచి రేవంత్ రెడ్డి ఎంపీగా గెలిచిన సంగతి తెలిసిందే.తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధించిన నేపథ్యంలో ఆయన సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.
ఈ క్రమంలో ఎంపీ పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయనున్నారు.







