టాలీవుడ్ ఇండస్ట్రీలో రైటర్ గా వక్కంతం వంశీ( Vakkantham Vamsi ) తనకంటూ మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలలో ఎక్కువ సినిమాలకు వక్కంతం వంశీ రైటర్ గా పని చేశారు.
స్టార్ రైటర్ గా గుర్తింపును సొంతం చేసుకున్న వక్కంతం వంశీ దర్శకునిగా మాత్రం ప్రూవ్ చేసుకోలేకపోతున్నారు.వక్కంతం వంశీకి దర్శకునిగా వరుస షాకులు తగులుతుండటం గమనార్హం.
వక్కంతం వంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన తొలి సినిమా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా( Naa Peru Surya Naa Illu India ) బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.అల్లు అర్జున్ కెరీర్ లో భారీగా నష్టాలను మిగిల్చిన సినిమాలలో ఈ సినిమా ఒకటిగా నిలిచింది.
నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా రిజల్ట్ వల్ల వక్కంతం వంశీకి మరో ఛాన్స్ రావడానికి దాదాపుగా నాలుగేళ్ల సమయం పట్టింది.ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ స్క్రిప్ట్ కోసం వక్కంతం వంశీ ఏడాదిన్నర పాటు కష్టపడ్డారు.

అయితే ఆ కష్టానికి పూర్తిస్థాయిలో ఫలితం దక్కలేదు.హాయ్ నాన్న, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ పోటీలో హాయ్ నాన్న( Hi Nanna ) పైచేయి సాధించింది.ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్( Extra Ordinary Man ) ట్రైలర్ బాగానే ఉన్నా ట్రైలర్ మెప్పించిన స్థాయిలో సినిమా మాత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయిందనే చెప్పాలి.ఈ మూవీ కలెక్షన్లు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాలి.
ఈ సినిమాకు భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

ఫుల్ రన్ లో ఈ సినిమాకు ఏ రేంజ్ లో కలెక్షన్లు వస్తాయో చూడాల్సి ఉంది.వక్కంతం వంశీకి ఇప్పట్లో మరో ఆఫర్ రావడం కష్టమేనని చెప్పవచ్చు.పవన్ సురేందర్ రెడ్డి కాంబో మూవీకి సైతం వక్కంతం వంశీ రైటర్ కాగా సోషల్ సెటైరికల్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.







