తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఇక అందరి ఫోకస్ ఏపీ మీద పడింది.తెలంగాణలో ఎవరూ ఊహించని రీతిలో కాంగ్రెస్ విజయదుంధుభి మోగించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారు.? వైఎస్ జగన్ సర్కారే వస్తుందా? లేక చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా? అనే దానిపై తెలుగు ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది.ఏపీలో ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టేది ఎవరనే విషయాన్ని కాసేపు పక్కన పెడితే.టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu naidu ) ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో ఉన్నారని తెలుస్తోంది.
తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి( Revanth Reddy ) చంద్రబాబు శిష్యుడేనంటూ టీడీపీ నేతలు సైతం ఏపీలోని పలు ప్రాంతాల్లో ఉత్సవాలు జరుపుకున్నారు.
అయితే ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ లో ఫలితాలు తారుమారు కావడంతో చంద్రబాబు ప్లేటు ఫిరాయించారని తెలుస్తోంది.తెలంగాణ మినహా మిగిలిన మూడు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో కమలం పార్టీకి చంద్రబాబు భయపడుతున్నారంటూ పలు విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలోనే కాంగ్రెస్ కు దూరంగా ఉండాలనే యోచనలో ఉన్నారని తెలుస్తోంది.

ఎక్కడా నోరు విప్పి హస్తం పార్టీకి అనుకూలంగా మాట్లాడొద్దని పార్టీ నేతలకు కూడా చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారంటూ వార్తలు వినిపిస్తున్నాయని తెలుస్తోంది.అయితే హైదరాబాద్ లో బుధవారం చంద్రబాబుతో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) కీలక సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే.ఈ భేటీలో ఇరువురు నేతలు పలు కీలక అంశాలపై చర్చించారని సమాచారం.

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కే( Skill Development Scam )సులో అరెస్ట్ అయిన చంద్రబాబు కొన్ని రోజులు రాజమండ్రిలోని సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.ఆ సమయంలో టీడీపీకి, చంద్రబాబుకు మద్ధతు తెలిపిన జనసేనాని జైలులో చంద్రబాబుని కలిశారు.అనంతరం బయటకు వస్తూ ఏపీలో టీడీపీ – జనసేన కలిసి ముందుకు వెళ్తాయని.వచ్చే ఎన్నికల్లో సైతం రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తాయని చెప్పారు.అలాగే టీడీపీ – జనసేన సారథ్యంలో ప్రభుత్వాన్ని సైతం ఏర్పాటు చేస్తామని జోస్యం చెప్పారు.అయితే ఆ సమయంలో జనసేనకు చంద్రబాబు 50 సీట్లు ఇచ్చేందుకు అంగీకారం తెలిపారని సమాచారం.
కానీ ఇటీవల జరిగిన సమావేశంలో సీట్ల విషయంపై మరోసారి చర్చ జరిగిందని తెలుస్తోంది.తాజాగా జనసేనకు 15 సీట్లు కూడా ఇచ్చే పరిస్థితి లేదని చంద్రబాబు చెప్పారట.
సీట్లు తగ్గించే పరిస్థితుల నేపథ్యంలో ప్యాకేజీని పెంచాలని జనసేనాని డిమాండ్ చేయగా అందుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఓ వార్త హల్ చల్ చేస్తుంది.యితే ఇందులో నిజానిజాలు తెలియాల్సి ఉన్నప్పటికీ టీడీపీ, జనసేన పార్టీలు వ్యవహారిస్తున్న తీరుపై ప్రజల్లోనే కాకుండా సొంత పార్టీ నేతలు, కార్యకర్తల్లోనూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోందని తెలుస్తోంది.
స్వార్థ రాజకీయాల కోసం పార్టీలను వాడుకుంటున్నారంటూ ప్రజలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారని సమాచారం.







