చిన్నపిల్లలకు ఏది మంచి ఏది చెడు అనే విషయాలు తెలుసుకునే సామర్థ్యం ఉండదు.అందువల్ల వారు ఎక్కువగా రిస్కుల్లో పడుతుంటారు.
ఒక ప్రమాదకర పని చేస్తే అది ప్రాణాలని తీసేస్తుందన్న భయం వారికి కలగదు.పసిప్రాయంలో ఏదీ తెలియని పిల్లలను కాపాడుకోవడం తల్లిదండ్రుల బాధ్యత.
అయితే తాజాగా చైనా( China )లోని పేరెంట్స్ తన చిన్నారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారు.అంతే, ఆ సమయంలో ఆ బిడ్డ అటు తిరిగి ఇటు తిరిగి చివరికి బొమ్మ అనుకుని ఒక విషపూరితమైన పామును చేత్తో పట్టేస్తుంది.

ఆ తర్వాత ఆ పాము( Snake )ను చేతిలో పట్టుకొని అటు ఇటు ఉరకడం చేసింది.అయితే ఇది చూసి స్థానికులు షాక్ అయ్యారు.ఆ పాము ఏ క్షణాన పాపను కాటేస్తుందేమోనని స్టన్ అయిపోయి చూస్తూ ఉండిపోయారు.చివరికి తల్లి తన చిన్నారి పెద్ద ప్రమాదంలో ఉందని గ్రహించింది.వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి పిల్ల చేతిలో నుంచి పామును పక్కన పడేసింది.దాంతో తృటిలో పెద్ద ప్రమాదమే తప్పింది.

ఈ షాకింగ్ దృశ్యాలను స్థానికంగా ఉన్న ఒక వ్యక్తి వీడియో రికార్డ్ చేశారు.ఆ వీడియోను ప్రముఖ వైరల్ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ @ ‘ఫిగెన్‘ ( Figen ) తాజాగా షేర్ చేసింది.పసిపాప పెద్ద పాముని పట్టేసిన ఈ వీడియో చూసి చాలామంది నెటిజన్లు కూడా నోరెళ్లబెట్టారు.ఓరి నాయనో ఆ పిల్లకి మామూలు ధైర్యం లేదు అని మరి కొందరు పేర్కొన్నారు.
ఆ పిల్లకి పాము డేంజరస్ అని తెలియక అలా చేసి ఉంటుందని మరికొందరు అన్నారు.ఈ పిల్లకు ఎలాంటి హాని జరగలేదని చివరికి తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు.
ఇప్పటివరకు ఈ వీడియోకు కోట్లలో వ్యూస్, లక్షల్లో లైకులు వచ్చాయి.దీనిని మీరు కూడా చూసేయండి.







